Ad Code

మెటాకు రూ.41 లక్షలు జరిమానా !

                                   

అమెరికాలోని జార్జియాకు చెందిన క్రాఫోర్డ్ అనే వ్యక్తి ఫేస్ బుక్ కంపెనీకే చెమట్లు పట్టించాడు. తన ఖాతాను యాక్సెస్ చేయడం కుదరకపోవడంతో ఫేస్ బుక్ పై కేసు పెట్టి 50 వేల డాలర్లుజరిమానా విధించేలా చేశాడు. సరైన కారణం చెప్పకుండా తన ఖాతాను టెర్మినేట్ చేయడంతో పాటు, సమస్యపై స్పందన కూడా లేకపోవడంతో 2022లో ఆయన కేసు పెట్టాడు. ‘ఒక ఆదివారం ఉదయాన్నే లేచాను. ఫేస్ బుక్ అకౌంట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే అది లాక్ అయింది. నన్ను బ్యాన్ చేశానని తెలిపారు. చైల్డ్ సెక్సువల్ ఎక్స్ ప్లాయిటేషన్ కారణంగా నన్ను లాక్ చేసినట్లు చిన్న స్నాప్ షాట్ ద్వారా తెలిపారు. తర్వాత అది కూడా పోయింది.’ అని క్రాఫోర్డ్ తెలిపాడు. కానీ తాను ఎప్పుడూ అటువంటివి చేయలేదని తెలిపాడు. దీంతోపాటు ఫేస్ బుక్ కూడా రూల్స్ ఎందుకు వయొలేట్ చేశాడో తెలపలేదు. ఈ సమస్య పరిష్కారం కోసం ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటాను సంప్రదించడానికి చాలా సార్లు ప్రయత్నించాడు. కానీ అతనికి అస్సలు ఒక్కసారి కూడా సమాధానం రాలేదు. గతంలో కూడా అతని ఖాతాపైన పొలిటికల్ కామెంట్స్ విషయంలో వయొలేషన్ పడింది. కానీ ఈసారి పూర్తిగా ఫేస్ బుక్ ప్రొఫైల్ నుంచి కూడా రిస్ట్రిక్ట్ చేశారు. దీంతో అతను కోర్టును ఆశ్రయించాడు. ‘ఇది బిజినెస్ చేసే పద్ధతి కాదు. ప్రజలను ఇలా ట్రీట్ చేయకూడదు. కనీసం నేనేం తప్పు చేశాననైనా తెలపాలి కదా.’ అని క్రాఫోర్డ్ వాపోయాడు. ఫేస్ బుక్ నుంచి సమాధానం రాకపోవడంతో వృత్తిరీత్యా లాయర్ అయిన క్రాఫోర్డ్ 2022 ఆగస్టులో నేరుగా కేసు పెట్టాడు. అయినా సరే ఫేస్ బుక్ నుంచి సమాధానం రాలేదు. అయితే ఫేస్ బుక్ లీగల్ టీమ్ ఈ లా సూట్కి సమాధానం ఇవ్వలేకపోయింది. దీంతో క్రాఫోర్డ్ కు 50 వేల డాలర్లు చెల్లించాల్సిందిగా మెటాను కోర్టు ఆదేశించింది. అయితే క్రాఫోర్డ్ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే మెటా తన ఫేస్ బుక్ ఖాతాను రీస్టోర్ చేసింది కానీ, జరిమానా ఇంకా చెల్లించలేదు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu