Ad Code

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 విడుదల


శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎన్నో అద్భుత ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ రూ.30 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. తాజాగా భారత్ మార్కెట్‌లోకి ప్రవేశించిన ఈ ఫోన్ 8 జీడీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నెల్ మెమోరీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. అలాగే ఈ ఫోన్ తాజాగా మంగళవారం మధ్యహ్నం 3 గంటల నుంచి ప్రీ ఆర్డర్‌ లకు కూడా అందుబాటులో ఉంది. కాగా ఈ ఫోన్ కి సంబందించిన సేల్ త్వరలోనే ప్రారంభం అయే అవకాశాలు ఉన్నాయి. 120Hz డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌, 6.7-అంగుళాల స్క్రీన్‌, ఫుల్ HD+ రిజల్యూషన్‌ AMOLED ప్యానెల్‌, స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, హోమ్-బ్రూడ్ ఎక్సినోస్ 1380 చిప్‌సెట్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఈ 5G ఫోన్ Android 13 OSతో పని చస్తుంది. అలాగే శాంసంగ్ కంపెనీ ఈ ఫోన్‌కి 4 ఏళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు, 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక 108ఎంపీ ప్రైమరీ సెన్సార్‌, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫోన్ ఫ్రంట్ సైడ్ 32ఎంపీ సెన్సార్ ఉంది. ఇక బ్యాటరీ గురించి మాట్లాడాలంటే.. 6,000mAh బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది. అలాగే ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సప్పోర్ట్ చేస్తుంది.offerbazar24/7

Post a Comment

0 Comments

Close Menu