Ad Code

వాట్సాప్ లో ఎడిట్ ఆప్షన్ ఫీచర్ !


వాట్సాప్ ఎడిట్ ఆప్షన్ తీసుకొచ్చింది. మనం మెసేజ్ పంపించిన 15 నిముషాల్లోపు ఎడిట్ చేయడానికి అవకాశం ఉంది. దీని ద్వారా మెసేజ్ లో తప్పులున్నా, అక్షర దోషాలున్నా సరిచేయవచ్చు. ప్రస్తుతం మనం వాడుతున్న వాట్సాప్ యాప్ లో ఎడిట్ మెసేజ్ ఫీచర్ ఇవ్వలేదు. కేవలం టెక్ట్స్ మెసెజెస్‌కు మాత్రమే ఆప్షన్ ఉంది. ఎడిట్ ఆప్షన్ ద్వారా వీడియోలు, ఫొటోలు, క్యాప్షన్లను కూడా పంపించిన తర్వాత 15 నిముషాల సమయంలో ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వాట్సాప్‌లో మనం ఎవరికైనా మెసెజ్ పంపించిన తర్వాత ఏదైనా తప్పు ఉందనిపిస్తే మీరు పంపించిన మెసెజ్‌పై ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలి. లేదంటే మెనూలోకి వెళ్లి ఎడిట్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. యాపిల్ ఫోన్లలో అయితే మెసేజ్ పై లాంగ్ ప్రెస్ చేయాలి. ఎడిట్ ఆప్షన్లపై ట్యాప్ చేయాలి. డెస్క్ టాప్ లో అయితే మెసేజ్ మెనూలోకి వెళ్లి ఎడిట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్‌పై ట్యాప్ చేసి  మెసేజ్ లో ఉన్న తప్పులను సరిదిద్ది అప్ డేట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేయడం పూర్తయిన తర్వాత చెక్ మార్క్‌పై ట్యాప్ చేస్తే మెసెజ్ అప్‌డేట్ అవుతుంది. ఆ తర్వాత ఎడిట్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఈ ఆప్షన్ కొంతమంది బీటా యూజర్లకే వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. అయితే సాధారణ వినియోగదారులందరికీ ఇటీవలే రోలౌట్ ప్రారంభించింది. మరికొద్ది రోజుల్లోనే యాపిల్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు ఈ ఎడిట్ మసేజ్ ఆప్షన్ ఆటోమాటిక్ గా కంపెనీ యాడ్ చేయబోతోంది. offerbazar24/7

Post a Comment

0 Comments

Close Menu