Ad Code

అమ్మకాలలో అదరగొట్టిన ఎంజీ మోటార్ ఇండియా !


ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ రిటైల్ అమ్మకాల జోరు కొనసాగుతోంది. మే 2023 నెలలో తన రిటైల్ అమ్మకాల గణాంకాలను ఎంజీ మోటార్ ప్రకటించింది. మొత్తం 5006 యూనిట్లతో రికార్డు స్థాయిలో విక్రయాలను సాధించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే.. 25శాతం వృద్ధిని కంపెనీ సాధించింది. ఎంజీ మోటార్ తమ ప్రొడక్టులకు సంబంధించి కార్యాచరణ ద్వారా మార్కెట్లో కంపెనీకి ఫుల్ డిమాండ్ పెరిగింది. అదే కస్టమర్ల నుంచి పూర్తి స్థాయిలో డిమాండ్ పెరిగేలా చేసింది. భారత మొట్టమొదటి ప్యూర్ -ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ SUV అయిన ZS EV అమ్మకాలలో వృద్ధి సాధించగా.. ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన MG కామెట్ EV-స్మార్ట్ EVకి కూడా వినియోగదారుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. తద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ పట్ల కూడా మరింత దృష్టిసారించేలా చేసింది. మే నెలాఖరులో, కంపెనీ ఎంజీ గ్లోస్టర్ భారత మొదటి అటానమస్ లెవల్-1 ప్రీమియం SUV ‘The Advance BLACKSTORM’ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. గుజరాత్‌లోని హలోల్‌లో ఉన్న ఎంజీ మోటార్ ఇండియా తయారీ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1,20,000 వాహనాలు కాగా.. 3వేల మంది ఉద్యోగులు ప్లాంటులో పనిచేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu