Ad Code

హెచ్‌డీ క్వాలిటీతో ఫొటోలు సెండ్ చేసే ఆప్షన్ !


వాట్సాప్ ఫొటోల నుంచి డాక్యుమెంట్స్ వరకు వివిధ మీడియా ఫైల్స్ సెండ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అయితే ఇతర మెసేజింగ్ అప్లికేషన్లలో లాగా వాట్సాప్‌లో లార్జ్ ఫైల్స్ పంపించడం కుదరడం లేదు. ముఖ్యంగా ఎక్కువ డేటా సైజు గల హై క్వాలిటీ ఫొటోలు పంపినా అవి ఒరిజినల్ సైజ్‌లో సెండ్ కావట్లేదు. అవి కంప్రెస్ అయ్యి అవతలివారికి వెళ్లడంతో, క్వాలిటీ చాలా తగ్గుతోంది. దీంతో క్వాలిటీ ఫొటోలు పంపించాలనుకునే యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గమనించిన వాట్సాప్, ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీని సాయంతో ఆండ్రాయిడ్‌ యూజర్లతో సహా ఐఫోన్ యూజర్లు హెచ్‌డీ క్వాలిటీ ఫొటోలు పంపించవచ్చు. సాధారణంగా HD క్వాలిటీ ఫొటోలు హైట్‌, విడ్త్‌ విషయంలో హై డైమెన్షన్స్ కలిగి ఉంటాయి. ప్రస్తుతం వాట్సాప్‌లో HD ఫొటోలను పంపిస్తే, వాటి డైమెన్షన్స్‌ను యాప్ ఆటోమేటిక్‌గా తగ్గించి అవతలి వ్యక్తికి పంపిస్తుంది. అయితే కొత్త ఫీచర్‌తో HD ఫొటోల డైమెన్షన్స్‌ దాదాపు తగ్గకుండా నేరుగా యూజర్లకు సెండ్ అవుతాయి. ఫలితంగా ఫొటోల క్వాలిటీ పెద్దగా తగ్గదు. టెస్ట్‌ఫ్లైట్ యాప్ నుంచి వాట్సాప్ బీటా iOS 23.11.0.76 అప్‌డేట్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ బీటా Android 2.23.12.13 అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసిన కొంతమంది బీటా టెస్టర్లకు కొత్త ఫీచర్ రిలీజ్ అయింది. వాట్సాప్ బీటా ఇన్ఫో రిపోర్ట్ ప్రకారం, బీటా టెస్టర్లు ఫోటోలు పంపించేటప్పుడు వాటి క్వాలిటీని మేనేజ్ చేసే ఒక కొత్త ఆప్షన్ చూస్తారు. ఫొటో క్వాలిటీ అని పిలిచే ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసి, స్టాండర్డ్ క్వాలిటీ, HD క్వాలిటీ అనే రెండు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. HD క్వాలిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసి, 4K కంటే ఎక్కువ క్వాలిటీ ఉన్న ఫొటోలను దాదాపు ఒరిజినల్ సైజుతోనే సెండ్ చేయడం కుదురుతుంది. HD క్వాలిటీ ఆప్షన్, లార్జ్ సైజు ఉన్న ఫొటోలు పంపించేటప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌తో పంపించిన ఫొటోల మెసేజ్‌ బబుల్‌లో HD అని ఒక లేబుల్ కూడా పడుతుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం, HD ఆప్షన్ ఉపయోగించి పంపించిన ఫొటోలు ఒరిజినల్ క్వాలిటీలో సెండ్ కావు. అవి స్వల్పంగా కంప్రెస్‌ అయ్యి అవతలి వ్యక్తికి చేరతాయి. డిఫాల్ట్‌గా స్టాండర్డ్ క్వాలిటీలోనే ఫొటోలు సెండ్ చేసుకునేలా వాట్సాప్ కొత్త ఫీచర్‌ని రూపొందించింది. కాబట్టి HD ఫొటో పంపాలనుకున్న ప్రతిసారి HD ఆప్షన్స్ సెలక్ట్ చేసుకోవాలి. హై క్వాలిటీలో ఫొటోలు మాత్రమే పంపించడానికి వాట్సాప్ ప్రస్తుతానికి అనుమతించింది. వీడియోలకు కొత్త ఫీచర్ వర్తించదు. కేవలం కన్వర్జేషన్లలో మాత్రమే ఫొటోలను HD క్వాలిటీలో సెండ్ చేయడం సాధ్యమవుతుంది. స్టేటస్ అప్‌డేట్స్‌లో హై క్వాలిటీ పిక్స్ అప్‌లోడ్ చేయలేరు. ఇక కొత్త ఫీచర్ వాట్సాప్ బీటా లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేసిన బీటా టెస్టర్లకు మాత్రమే ప్రస్తుతం రిలీజ్ అవుతుంది. స్టాండర్డ్ వాట్సాప్ వెర్షన్‌ యూజర్లకు ఈ ఫీచర్ త్వరలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.offerbazar24/7

Post a Comment

0 Comments

Close Menu