Ad Code

పోలీస్‌ కుక్కలున్నప్పుడు, పోలీస్‌ పిల్లులు ఎందుకు ఉండవు? : మస్క్‌ తనయుడి సందేహం


ఎలాన్‌ మస్క్‌ మూడేళ్ల కొడుకు ఎక్స్‌ ఏఈ తనను అడిగిన ప్రశ్నను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ ప్రశ్నకు ఢిల్లీ పోలీసులు చెప్పిన సమాధానం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ''లిటిల్‌ ఎక్స్‌ నన్ను ఓ ప్రశ్న అడిగాడు. పోలీస్‌ కుక్కలు ఉన్నప్పుడు, పోలీస్‌ పిల్లులు ఎందుకు ఉండవు? అనే సందేహం వచ్చింది '' అని మస్క్‌ ట్వీట్ చేశారు. అయితే, ఈ ప్రశ్నకు ఢిల్లీ పోలీసులు స్పందించారు. 'మస్క్‌.. మీ అబ్బాయికి చెప్పండి.. పోలీసు వ్యవస్థలో పిల్లులు ఉంటే వాటినే నేరస్థులుగా అరెస్ట్‌ చేయాల్సి వస్తుంది'' అని సరదాగా ఢిల్లీ పోలీసులు ట్వీట్‌ చేశారు. అయితే, ఢిల్లీ పోలీసులు రిప్లయ్‌కి నెటిజన్లు వివరణ ఇచ్చారు. సాధారణంగా ఇళ్లలో పిల్లులు ఇతరులకు తెలియకుండా పాలు, పెరుగు వంటి వాటిని స్వాహాచేస్తాయి. అది, వాటి స్వభావం. అందుకే వాటినే అరెస్ట్‌ చేయాల్సి ఉంటుందని పోలీసులు ట్వీట్‌ చేశారు అని కామెంట్ చేశారు. మరికొంతమంది, పోలీస్‌ కుక్కలతోపాటు , పిల్లులకు శిక్షణ ఇస్తే అవి రెండు గొడవపడుతూ నేరస్థులను విడిచిపెడతాయని నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu