Ad Code

నథింగ్ నుంచి స్మార్ట్‌వాచ్‌ ?


థింగ్ ట్రాన్స్‌పరంట్ డిజైన్లతో స్మార్ట్‌ఫోన్, ఇయర్‌బర్డ్స్ లాంచ్ చేసి చాలామందిని ఆకట్టుకుంది. ఈ కంపెనీ స్మార్ట్‌వాచ్‌ మార్కెట్లోకి సైతం ఎంట్రీ ఇవ్వనుంది. దీనికి సంబంధించిన ట్రేడ్‌మార్క్ కోసం నథింగ్ అప్లై చేసింది. ఇండియాకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో నథింగ్ స్మార్ట్‌వాచ్ గురించి వివరాలు ఉన్నట్లు ఒక టిప్‌స్టర్ కనుగొన్నారు. దాంతో ఈ కంపెనీ నుంచి స్మార్ట్‌వాచ్‌ భవిష్యత్తులో లాంచ్ కానుందని తెలుస్తోంది. నథింగ్ కంపెనీ ఇయర్ (1) ఇయర్‌బడ్స్‌తో కస్టమర్ల దృష్టిని ఆకర్షించింది. అప్పటినుంచి రకాల ప్రొడక్ట్స్‌పై ఫోకస్ పెట్టింది. అంతకు ముందే నథింగ్ ఫోన్ (1)ని రిలీజ్ చేసి పాపులర్ అయిన కంపెనీ, మరికొన్ని రోజుల్లో నథింగ్ ఫోన్ (2)ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీంతోపాటు కంపెనీ స్మార్ట్‌వాచ్‌పై పని చేస్తుందని రీసెంట్ రిపోర్ట్ పేర్కొంది. ఇలాంటి సరికొత్త ప్రొడక్ట్స్ తమ కంపెనీ నుంచి వస్తాయని నథింగ్ వ్యవస్థాపకుడు కార్ల్ పీ (Carl Pei) కూడా ఇటీవల వెల్లడించారు.

ఫోన్, వైర్‌లెస్ ఆడియో ప్రొడక్ట్ విడుదల చేసిన తర్వాత నథింగ్ స్మార్ట్‌వాచ్‌ తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండియన్ బ్యూరో వెబ్‌సైట్‌లో ఈ ప్రొడక్ట్ లిస్ట్‌ అయి కనిపించినందున ఈ డివైజ్‌ను ఇండియన్ మార్కెట్లోకి కూడా విడుదల చేయనున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు కంపెనీ ఫౌండర్ కార్ల్ పీ, స్మార్ట్‌వాచ్‌లపై ఆసక్తి వ్యక్తం చేశారు, ఇటీవలి పోస్ట్‌లో వాటి ప్రయోజనం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇతర బ్రాండ్‌లు తమ ప్రొడక్ట్ పేరును ఉపయోగించకుండా నిరోధించడానికి కంపెనీలు ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటాయి. నథింగ్ కంపెనీ కూడా భవిష్యత్తులో స్మార్ట్‌వాచ్‌ పేరును ఎవరూ వాడకుండా రిజిస్ట్రేషన్ ద్వారా సెక్యూర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను ఇప్పటికిప్పుడే విడుదల చేస్తారని చెప్పడానికి లేదు కానీ భవిష్యత్తులో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అయితే వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఈ కంపెనీ తన తొలి స్మార్ట్‌వాచ్‌లో కొత్తగా ఎలాంటి ఫీచర్ అందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. దాని ప్లాట్‌ఫామ్ నథింగ్ OS స్మార్ట్‌వాచ్‌లకు మరింత అనుకూలంగా ఉండేలా చేయడానికి బ్రాండ్ కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. కార్ల్ పీ రీసెంట్ కామెంట్స్ పరిగణనలోకి తీసుకుంటే, స్మార్ట్ వాచ్‌ను నథింగ్ డెవలప్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నథింగ్ ఫోకస్ అంతా నథింగ్ ఫోన్ (2)పైనే ఉంది. ఇది జులై 11న భారతదేశం, యూఎస్‌తో సహా ఇతర దేశాలలో లాంచ్ కానుంది. ఫోన్ (2) స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్‌తో పవర్‌ఫుల్ పర్ఫామెన్స్ ఆఫర్ చేయనుంది. నథింగ్ OS లేటెస్ట్ వెర్షన్‌ను ఇందులో ప్రీ-ఇన్‌స్టాల్ చేస్తుంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu