Ad Code

డబ్బింగ్ టూల్‌తో వీడియోలను డబ్‌ చేసుకునే ఆప్షన్ ?


యూట్యూబ్ కూడా ఒక ఉపయోగకరమైన ఏఐ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో క్రియేటర్లు తమ వీడియోలను ఇతర భాషల్లోకి సులభంగా డబ్  చేసుకోవచ్చు. ప్రస్తుతానికి యూట్యూబ్ వందలాది క్రియేటర్స్‌తో ఈ టూల్‌ను టెస్ట్ చేస్తోంది. అలౌడ్ అని పిలిచే ఈ ఏఐ ఫీచర్ ప్రస్తుతం కొన్ని భాషలకు సపోర్ట్ చేస్తుండగా మరికొద్ది రోజుల్లో మరిన్ని భాషలకు మద్దతు పొందుతుందని సమాచారం. ప్రస్తుతం అలౌడ్ డబ్బింగ్ టూల్ ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్‌ భాషలకు మాత్రమే మద్దతు ఇస్తుంది. అలౌడ్ డెవలపర్ టీమ్ ఈ డబ్బింగ్ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తున్నట్లు కంపెనీ యూఎస్‌లోని VidCon ఈవెంట్‌లో ప్రకటించింది. వారు గూగుల్‌కు చెందిన ఏరియా 120లో AI-పవర్డ్ డబ్బింగ్ టూల్ అలౌడ్‌ను డెవలప్ చేశారు. ఈ అనుభవంతో వారు యూట్యూబ్ డబ్బింగ్ టూల్‌ను యూజర్ల అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తారు. టెక్ వెబ్‌సైట్ ది వెర్జ్‌కి యూట్యూబ్ ప్రతినిధి అమ్జద్ హనీఫ్ వెల్లడించిన ప్రకారం, అలౌడ్ మొదట వీడియోను ట్రాన్స్‌స్క్రైబ్ చేస్తుంది, ఆ తర్వాత క్రియేటర్స్ రివ్యూ చేయగల ట్రాన్‌స్క్రిప్షన్ అందిస్తుంది. అందులో ఏవైనా తప్పులు ఉంటే వాటిని క్రియేటర్ ఎడిట్ చేయవచ్చు. తరువాత, ఈ టూల్ క్రియేటర్ ఎడిట్‌ చేసిన వెర్షన్‌ను ట్రాన్స్‌లేట్ చేసి డబ్‌ వీడియో రూపొందిస్తుంది. డబ్బింగ్ వీడియోలలో క్రియేటర్ లాంటి వాయిస్‌ను ఏఐ అనుసరిస్తుంది. మరింత ఎక్స్‌ప్రెషన్, లిప్ సింక్‌తో వీడియోను యూజర్లు లీనమైపోయి చూసేంత గొప్పగా మారుస్తుంది. యూట్యూబ్ అన్ని భాషలలో కోట్లాదిమంది యూజర్లను కలిగి ఉంది. ఇతర భాషల్లో క్రియేటర్స్ రూపొందించిన వీడియోలు వీరందరికీ చేరువవుతాయి కానీ భాష అర్థం కాక వారు వాటిని చూడటం మానేస్తారు. అదే డబ్‌ చేసి ఉంటే వేరే భాషల వారి వ్యూస్ కూడా క్రియేటర్స్ పొందే అవకాశం ఉంటుంది. అప్పుడు వారి రీచ్ పెరగడంతో పాటు రెవెన్యూ పెరుగుతుంది. డబ్బింగ్ టూల్ వల్ల భాష అడ్డంకి కాకుండా మల్టీ లాంగ్వేజ్‌లలో తమ కంటెంట్‌ను విస్తరిస్తూ మరింత పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu