Ad Code

చాట్‌జీపీటీ టెక్నాలజీతో పిల్లలకు స్టోరీలు చెప్పే టెడ్డీ బేర్స్ !


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భవిష్యత్‌లో పిల్లలకు స్టోరీలు చెప్పే చాట్‌జీపీటీ ఆధారిత టెడ్డీ బేర్స్ రానున్నాయి. పిల్లలతో మాట్లాడే స్మార్ట్ టాయ్స్ మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. పిల్లలతో ముచ్చట్లు చెప్పేలా స్మార్ట్ టాయ్‌లు 2028 నుంచి ఏఐ టెక్నాలజీని వాడనున్నాయి. ఏఐ ఆధారిత టాయ్‌లు పిల్లలకు బెడ్‌టైమ్ స్టోరీస్ చెబుతాయని వీటెక్ హోల్డింగ్స్ సీఈవో అలన్ వాంగ్ తెలిపారు. చాట్‌జీపీటీని ఓపెన్ఏఐ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏఐ చాట్‌బాట్ మనుషుల తరహాలో స్పందిస్తుండటంతో ఎన్నో టాస్క్‌లకు దీన్ని ఉపయోగిస్తున్నారు. చాట్‌జీపీటీకి విశేష ఆదరణ రావడంతో గూగుల్ బార్డ్‌, మైక్రోసాఫ్ట్ బింగ్ అనే చాట్‌బాట్స్‌ను లాంఛ్ చేశాయి. న్యూ టెక్నాలజీతో చిన్న పిల్లలు సైతం ఏఐ చాట్‌బాట్‌తో ఇంటరాక్ట్ అవుతారని ఎలక్ట్రానిక్ టాయ్ మేకర్ వీటెక్ హోల్డింగ్స్ వ్యవస్ధాపకులు వాంగ్ చెప్పుకొచ్చారు. 2028 నాటికి చాట్‌జీపీటీ తరహా టెక్నాలజీని బొమ్మల పరిశ్రమ అందిపుచ్చుకుని పిల్లలతో మాట్లాడే స్మార్ట్ టాయ్‌లను తయారు చేసేందుకు అడుగులు వేస్తుందని అన్నారు. పిల్లలు బుక్స్ నుంచి చదివేందుకు ప్రత్యామ్నాయంగా పిల్లల కోసం స్టోరీలను చెప్పేందుకు టెడ్డీ బేర్స్ వంటి స్మార్ట్ టాయ్స్ ఏఐని వినియోగిస్తాయని అంచనా వేశారు. పిల్లలకు స్టోరీలను వినిపించడమే కాకుండా ఏఐ ఆధారిత టాయ్స్ పిల్లల అభిరుచులకు అనుగుణంగా కస్టమైజ్డ్ స్టోరీలను చెప్పగలిగే సామర్ధ్యం కలిగిఉంటాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu