Ad Code

గూగుల్ కూడా డబ్బులిస్తుందట !


చేతిలో మొబైల్ ఉంటే చాలు  ఫింగర్స్ అటోమెటిక్ గా గూగుల్ సెర్చ్ ఇంజిన్ వైపు కదులుతుంటాయి. ఆన్‌లైన్‌లో ఏదైనా పని కావాలంటే వెంటనే గూగుల్ ఓపెన్ చేస్తాం.అలాగే చాలామంది గూగుల్ సెర్చ్‌ లో తమకు తెలియని విషయాల గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు. అలా సెర్చ్ చేసేవారికి జాక్ పాట్ తగిలింది. గోప్యత హక్కుల భంగంపై నమోదైన ఒక కేసులో యూజర్లకు పరిహారం అందించేందుకు గూగుల్ సిద్దమైంది. ఈ పరిహారం పొందాలంటే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2007 నుంచి 2013 మధ్యలో గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేసినవారికి ఆ పరిహారం వస్తుంది. దాదాపు రూ.189 కోట్ల పరిహారం చెల్లించేందుకు గూగుల్ ఒప్పుకుంది.మీరు అప్లై చేసుకుని ఇందులో మీ షేర్ తీసుకోవచ్చు.దీని కోసం జులై 31లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. refererheadersettlement.com వెబ్​సైట్​లోకి వెళ్లి Exclusion Form పైన క్లిక్​ చేసి మీ వాటా కోసం అప్లై చేసుకోవాలి.క్లాస్ మెంబర్ ఐడీ కోసం కొన్ని వివరాలు ఎంటర్ చేసి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారం నింపాలి.ఆ తర్వాత మీ మెయిల్ ఐడీకి క్లాస్ మెంబర్ ఐడీ వస్తుంది. క్లాస్ మెంబర్ ఐడీతో క్లెయిమ్ పేజీలోకి వెళ్లి అక్కడ మరో ఫారం ఫిల్ చేయాలి.నష్టపరిహారం కింద గూగుల్ ఒక్కొక్కరికి రూ.574 చెల్లిస్తుంది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని థర్డ్ పార్టీ వారికి అమ్ముకున్నారనే ఆరోపణలు గతంలో గూగుల్‌పై పెద్దఎత్తున వచ్చాయి. 2006 అక్టోబర్ నుంచి 2013 సెప్టెంబర్ మధ్య తమ వ్యక్తిగత వివరాలను గూగుల్ బహిర్గతం చేసిందనే ఆరోపణలతో కొంతమంది యూజర్లు కేసు వేశారు.అనేక సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తోంది.చివరికి ఇటీవల గూగుల్ నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పుకుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu