Ad Code

సంచార్ సాథీ తో పోయిన ఫోన్ ను కనుక్కోవచ్చు !


మొబైల్ ఫోన్ పోయినప్పుడు ఏం చేయాలో ఆలోచనరాదు. కొంచెం సేపు మైండ్ బ్లాంకవుతుంది. అంత ఖరీదు పెట్టి కొన్న ఫోన్ పోయిందన్న బాధ ఒకవైపు ఉంటే, మరోవైపు అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్లు, డేటా మొత్తం పోయ్యాయనే బాధ కలుగుతుంటుంది. ఏం చేయాలో అర్థంకాక కొత్త ఫోన్ బదులు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొందాంలే అనుకుంటాం. అయితే అది కూడా సెకండ్ హ్యాండ్ కాబట్టి అది జెన్యూన్ ఫోనా? కాదా? అనే సందేహం వెంటాడుతుంటుంది. అందుకు సంచార్ సాథీ తోడుగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ పోర్టల్ ను తీసుకువచ్చింది. దేశంలో మీ మొబైల్ ఎక్కడున్నా తక్కువ వ్యవధిలో కనిపెట్టడానికి తోడ్పడుతోంది. తక్కువ వ్యవధిలోనే అది మనచెంతకు చేరుతుంది.. చింత తొలగిస్తుంది. సంచార్ సాథీ వెబ్‍సైట్‍ను భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. టెలికాం శాఖ పరిధిలోని టెక్నాలజీ విభాగం సీ-డాట్  దీన్ని రూపొందించింది. మొబైల్ ఫోన్లు పోవడం, అపహరణకు గురవడంలాంటి సమస్యలకు పరిష్కారంగా ఎన్నో యాప్స్, పోర్టల్స్ ఉన్నాయి. అయితే ఫలితం మాత్రం కోరుకున్న విధంగా లేదు. ఈ క్రమంలోనే పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను తిరిగి సాధించేందుకు వీలుగా కేంద్రం దీన్ని తీసుకువచ్చింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ సంచార్ సాథీని ప్రారంభించారు.

ఫోన్ లో IMEI నెంబరును తెలుసుకోవాలంటే ఫోన్ కొన్నప్పుడు బాక్సుపై ఉంటుంది లేదంటే ఫోన్‍లో *#06# డయల్ చేస్తే నెంబరు వస్తుంది. అలాగే ఫోన్ బిల్లు, * ఇన్వాయిస్ పై కూడా IMEI నెంబరు ఉంటుంది. కొత్తగా మొబైల్ కొనే ముందు కూడా IMEI నెంబరు సాయంతో ఆ ఫోన్ జెన్యూనిటీని తనిఖీ చేయవచ్చు. సంచార్ సాథీ వెబ్‍సైట్ sancharsaathi.gov.in ఓపెన్‌ చేయాలి. హోమ్ పేజీలో సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ సెక్షన్‍లో బ్లాక్ యువర్ లాస్/స్టోలెన్ మొబైల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు నమోదు చేయాలి. నో యువర్ మొబైల్ అనే సెక్షన్ ఉంటుంది. దానికింద వెబ్‍పోర్టల్ అనే ఆప్షన్ కింద క్లిక్ హియర్ పై క్లిక్ చేయాలి. తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి. ఏ మొబైల్ గురించి చెక్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోన్ ఐఎంఈఐ నంబర్ ఎంటర్ చేసి చెక్ అనే బటన్‍పై క్లిక్ చేయాలి. ఆ మొబైల్ జెన్యూన్‌ అయితే.. ఐఎంఈఐ ఈజ్ వ్యాలిడ్ అని చూపిస్తుంది. బ్లాక్ లిస్టెడ్, డూప్లికేట్, ఆల్ రెడీ ఇన్ యూజ్ లాంటివి స్టేటస్‍లో చూపిస్తే అది జెన్యూన్ కాదని అర్థం.

Post a Comment

0 Comments

Close Menu