Ad Code

ఏఐ నుంచి కొలువుల కోత ఉంటుందని అనుకోవడం లేదు !


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రస్తుత రూపంతో ఉద్యోగాలకు ముప్పు ఉండదని, ఇప్పడిది టాస్క్ ఆధారితమేనని లాజిక్, రీజనింగ్ అవసరమైన పరిస్ధితిని అది డీల్ చేయలేదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఏఐ నుంచి ఎలాంటి కొలువుల కోత ఉంటుందని తాను అనుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏఐ ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుందనే రాబోయే కొన్నేండ్లలో ఏఐ విధ్వంసం చూస్తామని చెప్పలేమని అన్నారు. రీజనింగ్‌, లాజిక్‌తో కూడిన ఉద్యోగాలను ఏఐ ప్రస్తుతం రీప్లేస్ చేసే అవకాశం లేదని మంత్రి పేర్కొన్నారు. యూజర్‌కు న్యూ టెక్నాలజీతో తలెత్తే ముప్పుల ఆధారంగా ఏఐని రెగ్యులేట్ చేస్తామని, ఏఐ నియంత్రణపై మాట్లాడుతూ రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. డిజిటల్ సిటిజన్ల ప్రయోజనాలను కాపాడుతూ వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించాలనుకునే కంపెనీలు ముందుగా యూజర్లకు తలెత్తే ముప్పులను నివారించాల్సి ఉంటుందని అన్నారు. వెబ్ 3 లేదా ఇతర టెక్నాలజీలు డిజిటల్ సిటిజన్లకు ముప్పుగా పరిణమించకుండా ఎలా నియంత్రించామో ఏఐని కూడా తాము అదే తరహాలో కట్టడి చేస్తామని చెప్పారు.offerbazar24/7

Post a Comment

0 Comments

Close Menu