Ad Code

వాట్సాప్ విండోస్ యూజర్లకు కొత్త ఫీచర్ !

                                    

వాట్సాప్ విండోస్ యాప్‌లో సరికొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ మెరుగుపరుస్తోంది. కొద్ది రోజుల క్రితం స్క్రీన్ షేరింగ్‌కు సపోర్ట్ అందించిన కంపెనీ, ఇప్పుడు మరొక ఫీచర్‌ను పరిచయం చేసింది. విండోస్ యాప్ యూజర్లు మిస్డ్ కాల్స్‌ను మరింత సులభంగా గుర్తించే స్పెసిఫికేషన్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఇప్పుడు వాట్సాప్‌లో కాల్‌ వచ్చినప్పుడు, దానికి సమాధానం ఇవ్వనప్పుడు, ఈవెంట్ మెసేజ్‌లో "కాల్ బ్యాక్ " బటన్ కనిపిస్తుంది. యూజర్లు తమను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తికి సులభంగా తిరిగి కాల్ చేయడానికి ఈ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి, మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి విండోస్ వాట్సాప్ బీటా లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం, విండోస్ 2.2323.1.0 వాట్సాప్ బీటా అప్‌డేట్‌ లేదా 2.2322.1.0 బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని కాల్ బ్యాక్ ఫీచర్‌ను పొందవచ్చు. ఇది మరికొద్ది వారాల్లో అందరికీ రిలీజ్ అవుతుందని WABetaInfo రిపోర్ట్ తెలిపింది. దీనికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించడంతోపాటు ఒక స్క్రీన్‌షాట్‌ను సైతం ఈ ప్లాట్‌ఫామ్ షేర్ చేసింది. వాట్సాప్ బీటా ఇన్ఫో స్క్రీన్‌షాట్‌ ప్రకారం.. కాల్ మిస్ అయినప్పుడు ఈవెంట్ మెసేజ్‌లో "కాల్ బ్యాక్" బటన్‌ కనిపించింది. ఈ బటన్‌పై సింగిల్ ట్యాప్‌తో మిస్డ్ కాల్‌ ఇచ్చిన వారికి సులభంగా తిరిగి కాల్ చేయవచ్చు. విండోస్ యాప్‌లో మిస్డ్ కాల్ వచ్చిందని గుర్తించడం ప్రస్తుతం ఇబ్బందిగా మారింది. తిరిగి కాల్స్ చేయడం కూడా ఒక పెద్ద ప్రాసెస్. దీనివల్ల యూజర్లు ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన వాట్సాప్‌, చాట్ నుంచే నేరుగా కాల్ బ్యాక్ చేసే ఫెసిలిటీని ఆఫర్ చేసింది. కాల్ బ్యాక్ ఫీచర్ ఒక క్లియర్ విజువల్ ఇండికేషన్‌గా నిలుస్తుంది కాబట్టి మిస్డ్ కాల్స్ గురించి యూజర్లు తెలుసుకోవడం మరింత సులభతరం అవుతుందని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu