Ad Code

వాట్సాప్‌లో చాట్ లాక్ ఫీచర్‌ !


వాట్సాప్ ప్రతి యూజర్ కోసం కొత్త చాట్ లాక్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు యూజర్ ప్రొఫైల్ సెక్షన్‌లో ఈ లాక్ ఫీచర్ కనిపిస్తుంది. ఈ కొత్త అప్‌డేట్ ఎవరైనా నిర్దిష్ట వాట్సాప్ చాట్‌లకు లాక్‌ చేసేందుకు అనుమతిస్తుంది. తద్వారా మీ చాట్ ఎవరూ చెక్ చేయలేరు. మీ ఫోన్ ఎవరికైనా ఇచ్చినట్టు అయితే ఆ వ్యక్తి మీ వ్యక్తిగత చాట్‌లను చూడకుండా నివారించవచ్చు. కొత్త వాట్సాప్ చాట్ లాక్ ఆప్షన్ నోటిఫికేషన్‌లలో కూడా చాట్ కంటెంట్‌లను ఆటోమాటిక్‌గా హైడ్ చేస్తుంది. అంటే.. మీ ప్రైవసీకి ఇక ఫుల్ ప్రొటెక్షన్ అందిస్తుంది. వాట్సాప్ లాక్ చేసిన చాట్‌ల నుంచి కొత్త మెసేజ్ వస్తుంది. కానీ, మీరు యాప్‌ను ఓపెన్ చేస్తే కొత్త మెసేజ్ లాక్ చేసిన ఫోల్డర్‌లో హైడ్ అవుతుంది. అది మీకు కనిపించదు. తద్వారా యూజర్ల ప్రైవసీకి మరింత భద్రత అందిస్తుంది. వాట్సాప్ చాట్ లాక్ ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలంటే వాట్సాప్ ఓపెన్ చేసి లాక్ చేయాలనుకునే నిర్దిష్ట చాట్‌కి వెళ్లండి.  చాట్ ప్రొఫైల్ సెక్షన్ విజిట్ చేయండి. కిందికి స్క్రోల్ చేయండి. Chat Lock > Enable క్లిక్ చేయండి. మీ ఫోన్ రిజిస్టర్డ్ ఫింగర్ ఫ్రింట్ ఉపయోగించి చాట్‌ను Lock చేయండి. వాట్సాప్ కొత్త చాట్ లాక్ ఫీచర్ యూజర్లకు అందిస్తుంది. ఈ యాప్ చాలా నెమ్మదిగా పని చేస్తుంది. మీరు ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌ని ఉపయోగించి చాట్‌లను అన్‌లాక్ చేయొచ్చు. కానీ, లాక్ చేసిన ఫోల్డర్‌ను ఓపెన్ చేయడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది. వాట్సాప్‌లో అన్‌లాక్ ప్రాసెస్ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈ సమస్య యూజర్లకు కొద్దిగా ఇబ్బంది కలిగించే విషయమే. మీరు చాట్ లాక్ ఫోల్డర్‌ని ఓపెన్ ఉంచి, విండోను క్లోజ్ చేయడం మరిచిపోతే.. మీ వాట్సాప్‌ని ఓపెన్ చేసిన ఎవరైనా మీ సూపర్ పర్సనల్ చాట్‌లను చూడవచ్చు. ఎవరైనా తమ ప్రైవేట్ టెక్స్ట్ మెసేజ్‌లను చూడకూడదంటే.. వాట్సాప్ యాప్‌ను మూసివేసే ముందు ఫోల్డర్‌ను క్లోజ్ చేయాలి. అంతేకాదు.. మీరు యాప్‌ను క్లోజ్ చేసినా ప్లాట్‌ఫారమ్ ఆటోమాటిక్ లాక్‌ని పాతదానికి యాడ్ చేయదు. యూజర్ ఫోన్‌లో ఏదైనా ఇతర యాప్‌ను ఉపయోగించే ముందు లాక్ చేసిన ఫోల్డర్‌ను మూసివేసినట్లు నిర్ధారించుకోవాలి. వాస్తవానికి ఇదో ఒక బగ్.. రాబోయే కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా వాట్సాప్ ఈ బగ్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మీరు ఈ బగ్ ఫిక్స్ చేయలేరు. వాట్సాప్ చాట్ లాక్ ఆప్షన్ ఎంచుకోకుండా వాట్సాప్ యాప్ ఫింగర్ ఫ్రింట్ లాక్ ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu