Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, June 4, 2023

నీటిని టెస్ట్ చేసే టీడీఎస్ మీటర్‌


తాగునీరు అపరిశుభ్రంగా ఉంటే, అది అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. నీటి వల్ల వచ్చే వ్యాధులలో కిడ్నీ ఫెయిల్యూర్ డేంజర్ అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా మరణించిన వారి సంఖ్య అధికంగా కనిపిస్తోంది. స్వచ్ఛమైన నీటిని తాగాలి. నీటిలో చాలా ఖనిజాలు ఉంటాయి. ఇవి సరైన పరిమాణంలో లేకపోతే, అప్పుడు కిడ్నీలు దెబ్బతింటాయి. చాలా మంది బోర్ నుంచి వచ్చే నీటిని తాగుతుంటారు. బోరు నీరు మన కిడ్నీలను దెబ్బతీస్తాయి. ఎందుకంటే భూమిలో ఉండే నీటిలో వివిధ ప్రాంతాలలో వివిధ ఖనిజాలు మిళితం అవుతాయి. అందులో సోడియం, పొటాషియం లాంటివి ఉంటాయి. వీటిని మంచినీళ్లుగా భావించి తాగితే ఆరోగ్యం పాడవుతుంది. చాలా ఇళ్లలో RO వాటర్ ప్యూరిఫైయర్లను వాడుతున్నారు. ఇందులో ఉప్పునీరు కూడా శుద్ధి చేయబడి తీపిగా మారుతుంది. అయితే ఒకసారి మీరు మీ ఇంట్లో తాగుతున్న నీటిని టీడీఎస్ మీటర్‌తో టెస్ట్ చేయడం బెటర్. ఈ రేటింగ్ 300 mg నుండి 600 mg మధ్య ఉంటే.. మీ RO నీరు త్రాగడానికి ఉపయోగం అని చెప్పొచ్చు. లేకపోతే మీరు మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్‌లలో అనేక టీడీఎస్ మీటర్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అనేక టీడీఎస్ మీటర్ల ధర రూ.99 నుంచి ప్రారంభమవుతుంది. మీరు దీన్ని ఈ-కామర్స్ సైట్ అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, టీడీఎస్ మీటర్‌ను మీ సమీప మార్కెట్‌లోని మెడికల్ స్టోర్ లేదా హార్డ్‌వేర్ స్టోర్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు.https://t.me/offerbazaramzon


No comments:

Post a Comment

Popular Posts