Ad Code

వారానికి ఐదు రోజులు ఆఫీస్ నుంచే పని చేయాలి

                                         

ఇన్ఫోసిస్ 'వర్క్ ఫ్రం హోం' పాలసీని ముగించింది. క్రమంగా తన ఉద్యోగులను ఆఫీసులకు రావాలని పిలుస్తోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని పరిచయం చేశాయి. గత రెండేళ్లుగా కోవిడ్ దాదాపుగా తగ్గిపోయింది. ఇక తన ఉద్యోగులు కంపెనీలకు రావాలని పలు ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ వదిలి ఆఫీసులకు వచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇలాంటి వారిపై చర్యలకు కూడా సిద్ధం అవుతామని ఐటీ కంపెనీలు హెచ్చిస్తున్నాయి. గూగుల్ తో సహా అనేక టెక్ కంపెనీలు వర్క్ ఫ్రం హోంవిధానాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాయి. భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొంతమంది ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కఠినంగా ఆదేశించింది. ఇన్ఫోసిస్ అమెరికా, కెనడాల్లోని తన ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేయాలని ఆదేశించింది. రిమోట్ గా పనిచేయాలంటే తప్పని సరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలని ఉద్యోగులకు తెలియజేసింది. వారానికి ఐదు రోజలు ఆఫీస్ నుంచి పనిచేయాలని ఆదేశించింది. ఎవరైనా కొత్త వర్క్ పాలసీని పాటించడంతో విఫలం అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇన్ఫోసిస్ కు యూఎస్, కెనడాల్లో 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే ఈ వర్క్ పాలసీ ప్రస్తుతానికైతే భారతదేశానికి వర్తింప చేయలేదు. అయితే గతేడాది ఉద్యోగులు క్రమంగా ఆఫీసులకు రావడానికి మూడు దశల ప్రణాలిక ప్రవేశపెట్టింది. మొదటి దశలో ఉద్యోగుల సౌలభ్యం ప్రకారం వారానికి రెండు రోజలు కార్యాలయాలకు రావాలి. రెండవదశలో ఉద్యోగులు వేరే బ్రాంచ్ కు మార్చడం లేదా ట్రాన్స్ఫర్స్ చేసుకునే ఛాయిస్ ఇచ్చింది. మూడో దశలో హైబ్రీడ్ మోడ్ లో పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైబ్రీడ్ మోడ్ ప్రకారం ఉద్యోగులు ఖచ్చితంగా వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలి. ఫిబ్రవరి నెలలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మాట్లాడుతూ యువకులు కూడా ఇంటి వద్ద నుంచి పనిచేస్తామని పట్టుబట్టకూడదని,నైతికత, సోమరితనంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. మూన్ లైటింగ్, వర్క్ ఫ్రం హోమ్, వారానికి మూడు రోజులే వస్తానని కోరవద్దని ఆయన ఉద్యోగులకు సూచించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu