ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ వివిధ సిగ్నల్స్ ఆధారంగా కంటెంట్‌ను ర్యాంక్ చేస్తుంది. ఈ సిగ్నల్స్‌లో యూజర్ లైక్ చేసిన, షేర్ చేసిన, సేవ్ చేసిన లేదా కామెంట్ చేసిన పోస్ట్‌ల వంటి యాప్ యాక్టివిటీస్ ఉంటాయి. పోస్ట్ పాపులారిటీ, వివరాలు, అలాగే దానిని పోస్ట్ చేసిన వ్యక్తి గురించిన సమాచారం కూడా ర్యాంకింగ్‌పై ప్రభావం చూపుతాయి. మొత్తం మీద ఒక పోస్ట్‌పై యూజర్ ఆసక్తిని అంచనా వేయడానికి ఇన్‌స్టాగ్రామ్ ఈ సిగ్నల్స్ ఉపయోగిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్ అభ్యంతరకరమైన లేదా హానికరమైన కంటెంట్‌ను తీసివేయడానికి కమ్యూనిటీ గైడ్‌లైన్స్ కూడా అమలు చేస్తుంది. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే ఖాతాల పోస్టులు ఫీడ్‌లో కనిపించకుండా నిలిపివేస్తుంది. ఈ విషయాలను క్రియేటర్స్ గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడితే ఫీడ్‌లో తమ కంటెంట్ బాగా ర్యాంక్ అయ్యేలా చేసుకోవచ్చు. రీల్స్ లైక్స్, సేవ్స్, షేర్స్, కామెంట్స్, రీసెంట్ ఎంగేజ్‌మెంట్ సహా యూజర్ యాక్టివిటీ వంటి సిగ్నల్స్ ఆధారంగా ర్యాంక్ అవుతాయి. రీల్‌ను పోస్ట్ చేసిన వ్యక్తితో ఇంటరాక్షన్ హిస్టరీ, వారు వాడిన ఆడియో ట్రాక్, విజువల్స్, వారి పాపులారిటీ ర్యాంకింగ్‌ను ప్రభావితం చేస్తాయి. రికమండేషన్ గైడ్‌లైన్స్ కూడా రీల్స్‌కు వర్తిస్తాయి. కొన్ని రకాల రీల్స్ విజిబిలిటీని యాప్ కావాలనే తగ్గించి ఉండవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌కి చెందిన స్టోరీస్ వ్యూయింగ్ హిస్టరీ, ఎంగేజ్‌మెంట్ హిస్టరీ, అకౌంట్ ఓనర్‌తో వారికి ఉన్న సంబంధం వంటి సిగ్నల్స్ ఆధారంగా స్టోరీస్‌ను ర్యాంక్ చేస్తుంది. ఫలానా అకౌంట్ స్టోరీస్‌ను ఎంత తరచుగా చూస్తున్నారు, వాటితో ఎంతగా ఎంగేజ్ అవుతున్నారు వంటి విషయాలను పరిగణలోకి తీసుకొని, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు మిస్ కాకూడని అకౌంట్ల స్టోరీస్‌ను ఎక్కువగా ర్యాంక్ చేస్తుంది. కమ్యూనిటీ మార్గదర్శకాలు కూడా స్టోరీస్‌కి వర్తిస్తాయి. పోస్ట్ పాపులారిటీ, ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లో యూజర్ యాక్టివిటీ, పోస్టర్ (పోస్ట్ చేసే యూజర్)తో యూజర్ ఇంటరాక్షన్, పోస్టర్ గురించిన సమాచారం వంటి సిగ్నల్స్ ఆధారంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ను ఎక్స్‌ప్లోర్ ఫీచర్ సజెస్ట్ చేస్తుంది. తగిన కంటెంట్‌ను నిర్ధారించడానికి ఇన్‌స్టాగ్రామ్ రికమండేషన్, కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనుసరిస్తుంది. యూజర్లు సున్నితమైన కంటెంట్ నియంత్రణలను ఉపయోగించుకోవచ్చు, వారికి రికమండ్ చేసే కంటెంట్ టైప్స్ మార్చుకోవచ్చు. https://t.me/offerbazaramzon
No comments:
Post a Comment