Ad Code

ఆగస్టులో వన్‌ప్లస్ ఫోల్డ్‌ ?


వన్‌ప్లస్ నుంచి తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ ఫోల్డ్  ఆగస్టు  19లోపు లాంఛ్ కానుందని టెక్ నిపుణులు అభిషేక్ యాదవ్ అంచనా వేస్తున్నారు. లాంఛ్‌పై వన్‌ప్లస్ ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి డేట్‌ను ప్రకటించలేదు. వన్‌ప్లస్ ఫోల్డ్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తే ప్రధానంగా గత కొన్నేండ్లుగా ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో నిలదొక్కుకున్న శాంసంగ్‌, మొటొరోలా బ్రాండ్లకు దీటైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఇక శాంసంగ్‌, మొటొరోలా సైతం తమ నెక్ట్స్ జనరేషన్ ఫోల్డింగ్ ఫోన్లను గెలాక్సీ జడ్‌, రేజర్ సిరీస్ కింద వచ్చే నెలలో భారత్‌లో లాంఛ్ చేయనున్నాయి. అయితే వీటిని దీటుగా ఎదుర్కొనే ఫీచర్లతోనే వన్‌ప్లస్ ఫోల్డ్ సంసిద్ధమైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫోల్డబుల్ ఫోన్ల ఫీచర్లపై ఇప్పటివరకూ వన్‌ప్లస్ ఎలాంటి వివరాలు వెల్లడించకపోవడంతో ఈ సందేహం వెంటాడుతోంది. లీకులను బట్టి వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్‌లో వన్‌ప్లస్ 11 5జీ, వన్‌ప్లస్ 10 ప్రొ జీ తరహాలోనే హాసిల్‌బ్లాద్ ట్యూన్‌డ్ కెమెరాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఈ ఫోన్ న్యూ జెనరేషన్ శాంసంగ్ 8 జెన్ 2 ఎస్ఓసీ ప్రాసెసర్‌, 5జీ సపోర్ట్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. హార్డ్‌వేర్ విషయంలో వన్‌ప్లస్ ఫోల్డ్ ప్రత్యర్ధులకు దీటైన పోటీ ఇస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మార్కెట్‌లో అడ్వాంటేజ్ కోసం ధరను హేతుబద్ధంగా నిర్ణయిస్తే మెరుగైన స్పందన ఉంటుందని భావిస్తున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu