Ad Code

వేరియబుల్ పే పాలసీలో మార్పులు ?


హెచ్‌సీఎల్ టెక్ కీలక నిర్ణయం తీసుకుంది. వేరియబుల్ పేలో భాగమైన ఎంగేజ్‌మెంట్ పర్ఫార్మెన్స్ బోనస్ పాలసీని సవరించింది. ఈ నిర్ణయంతో కంపెనీలోని కొంతమంది ఉద్యోగుల జీతం తగ్గుతుందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై హెచ్‌సీఎల్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. గతంలో కరోనా సమయంలో అందరికీ 100శాతం వేరియబుల్ పే పాలసీని ఇచ్చామని, ఇప్పుడు పాత పాలసీని తిరిగి అమలు చేస్తున్నామని తెలిపింది. మంచి పర్ఫార్మెన్స్ కనబర్చినవారికి 2023 మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి వేరియబుల్ పే పాలసీ అందుకుంటారు. పనితీరు సరిగాలేని ఉద్యోగులకు కంపెనీ పాలసీ ప్రకారమే ఈపీబీని అందజేస్తారు. అంతేతప్ప ఉద్యోగుల జీతాలను తగ్గించడం లేదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. బిజినెస్ టుడే రిపోర్ట్ ప్రకారం.. హెచ్‌సీఎల్‌ టెక్ ఇప్పటికే ఈ విషయాన్ని ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా తెలియజేసింది. '2023 ఏప్రిల్1 నుంచి అమల్లోకి వచ్చిన క్వార్టర్లీ మేనేజర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఉద్యోగులకు వేరియబుల్ పే పాలసీచెల్లించనున్నారు. కీ పర్ఫార్మెన్స్ పారామీటర్స్, లక్ష్యాలు నిర్దేశించనున్నారు. ప్రతి త్రైమాసికం ముగింపులో స్కోర్- బేస్డ్ వర్కింగ్ రివ్యూ తప్పనిసరిగా ఉంటుంది. బెంచ్‌(సరైన పనితీరు కనబర్చని)లో ఉన్న ఉద్యోగులు సంబంధిత కాలానికి వేరియబుల్ పే పాలసీపొందలేరు.' అని కంపెనీ ఇమెయిల్‌లో పేర్కొంది. త్రైమాసికంలో నిష్క్రమించే ఉద్యోగులకు సైతం వేరియబుల్ పే పాలసీ ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి సమయంలో సపోర్ట్ ఇవ్వడానికి అర్హత ఉన్న ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే పాలసీ చెల్లించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రస్తుతం అదుపులోకి వచ్చిందని దీంతో కొన్ని కొత్త మార్పులు చేసినట్లు కంపెనీ ఒక స్టేట్‌మెంట్ విడుదల చేసింది. 'E3 బ్యాండ్ వరకు మొత్తం పరిహార ప్యాకేజీలో భాగంగా ఎంగేజ్‌మెంట్ పర్ఫార్మెన్స్ బోనస్ ను అందిస్తాం. ఎంగేజ్‌మెంట్ పర్ఫార్మెన్స్ బోనస్ సాధారణంగా మొత్తం పరిహారంలో 3-4 శాతం ఉంటుంది. సగటు పేమెంట్ సుమారు 80 శాతంగా ఉంటుంది. ఎంప్లాయిమెంట్ కాంటాక్ట్ ప్రకారం EPBని పర్ఫార్మెన్స్-లింక్డ్ వేరియబుల్ పేగా గుర్తిస్తాం. ఇది కంపెనీ పాలసీ ప్రకారం ఉంటుంది. మహమ్మారి సమయంలో ఉద్యోగులకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడానికి కంపెనీ ఒక పాలసీ మినహాయింపు ఇచ్చింది. పనితీరుతో సంబంధం లేకుండా 100 శాతం EPB చెల్లించింది. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం లేకపోవడంతో తిరిగి పాత పాలసీని పునరుద్ధరిస్తున్నాం.' అని హెచ్‌సీఎల్ టెక్ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. హెచ్‌సీఎల్ టెక్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై ఎంప్లాయూ యూనియన్ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ స్పందించింది. ఐటీ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటం కీలకమని, కంపెనీలు తమ చర్యలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని యూనియన్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ అన్నారు. కాగా, హెచ్‌సీఎల్ టెక్ 2023 Q4 ఫలితాలను ఇటీవల ప్రకటించింది. కంపెనీ నికర లాభం 11 శాతానికి పెరగడం గమనార్హం.

Post a Comment

0 Comments

Close Menu