Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, June 6, 2023

ఫోన్‌పే లో అగ్రిగేటర్ సర్వీసులు !


ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే అకౌంట్‌ తాజాగా అగ్రిగేటర్‌ సర్వీసులను లాంచ్‌ చేసింది. ఫోన్‌పేకు చెందిన అనుబంధ సంస్థ ఫోన్‌పే టెక్నాలజీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ సేవలను తీసుకొచ్చింది. ఈ సర్వీసుల ద్వారా యూజర్లు తమ ఆర్థిక వివరాలను బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలతో పంచుకోవచ్చు. ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్స్‌ను, సేవలను త్వరగా పొందడానికి అగ్రిగేటర్ సేవలు ఉపయోగపడతాయని ఫోన్‌పే తెలిపింది. కస్టమర్లు, ఆర్థిక సంస్థలు ఫైనాన్షియల్‌ డేటాను సులువుగా పంచుకునేందుకు ఈ- ఫ్రేమ్‌వర్క్‌ను ఆర్‌బీఐ రూప కల్పన చేసింది. ఇందులో భాగంగా 2021 లో ఆర్‌బీఐ నుంచి ఫోన్‌పే అకౌంట్‌ అగ్రిగేటర్‌ లైసెన్స్‌ ను పొందింది. ఈ అగ్రిగేటర్ కింద కొత్తగా రుణాలు తీసుకోవడం, ఇన్సురెన్స్‌ పాలసీల కొనుగోలు చేయడం, పెట్టుబడి సలహాలు పంచుకోవడంలో ఆయా ఆర్థిక సంస్థలు వినియోగదారులకు సహాయపడతాయి. ఇప్పటికే ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ లాంటి 100 కు పైగా ఆర్థిక సంస్థలతో ఫోన్‌పే టైఅప్ అయింది. ఈ అగ్రిగేటర్ సేవలను పొందేందుకు యూజర్లు ముందుగా ఫోన్‌పే యాప్‌లో అకౌంట్‌ అగ్రిగేటర్‌ అకౌంట్ ను క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత యూజర్ బ్యాంక్‌ ఖాతాలను లింక్‌ చేయాలి. ఒకసారి అన్ని ఖాతాలూ లింక్‌ చేసిన తర్వాత తమ ఫైనాన్షియల్‌ డేటాను ఆర్థిక సంస్థలతో పంచుకోవాలంటే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుమతిని తాత్కాలికంగా నిలుపుదల చేసుకోవడం గానీ, పూర్తిగా ఉపసంహరించుకోవడం చేయొచ్చని ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు, సీటీ రాహుల్‌ చారి తెలిపారు.

No comments:

Post a Comment

Popular Posts