Ad Code

టీసీఎస్ క్యూ1లో రూ.11,074 కోట్ల నికర లాభం


టెక్నాలజీ మేజర్ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అంచనాలను బ్రేక్ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 17 శాతం గ్రోత్‌తో రూ.11,074 కోట్ల నికర లాభం గడించింది. కన్సాలిడేటెడ్ రెవెన్యూ దాదాపు 13 శాతం పెంచుకుని రూ.59,381 కోట్ల ఆదాయం సముపార్జించింది. టీసీఎస్ నికర లాభం రూ.10,890 కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఆదాయం రూ.59,500 కోట్లు సంపాదిస్తుందన్న మార్కెట్ అంచనాల కంటే స్వల్పంగా తగ్గింది. 17 శాతం నికర లాభాలు గడించడంతో వాటాదారులకు టీసీఎస్ వాటాపై రూ.9 ఇంటరిమ్ డివిడెంట్ ప్రకటించింది. అయితే, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్-జూన్ మధ్య దాదాపు మూడు శాతం నికర లాభం తగ్గిపోయింది. గత 12 త్రైమాసికాల్లో నికర లాభం అతి తక్కువ గ్రోత్. కరెన్సీ టర్మ్స్ లో టీసీఎస్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన దాదాపు ఏడు శాతం గ్రోత్ సాధించింది. నిర్వహణ లాభాలు 23.2 శాతం కాగా, గత మార్చి త్రైమాసికంతో పోలిస్తే 130 బేసిక్ పాయింట్లు తక్కువ. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu