దేశీయ మార్కెట్లోకి హైసెన్స్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. ఒకేసారి 4 కొత్త 4కే టీవీలను తీసుకువచ్చింది. వీటిల్లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ తీసుకువచ్చిన టీవీల్లో 120 ఇంచుల స్మార్ట్ టీవీ కూడా ఒకటి ఉంది. హైసెన్స్ కంపెనీ తీసుకువచ్చిన ఈ స్మార్ట్ టీవీ పేరు లేజర్ టీవీ. ఈ టీవీలో మీరు నెట్‌ఫ్లిక్స్ , ప్రైమ్ వీడియో, జీ5, ఈరోస్ నౌ, జియో సినిమా, యూట్యూబ్, హంగామా ఇలా పలు రకాల ఓటీటీ యాప్స్ చూడొచ్చు. అయితే వీటికి మీ వద్ద సబ్‌స్క్రిప్షన్ ఉండాల్సిందే. అప్పుడు మీకు నచ్చిన కంటెంట్ చూడొచ్చు. అలాగే ఈ టీవీలో 40 వాట్ స్పీకర్లు, డాల్బే ఆటమ్స్, డాల్బే విజన్, 240 హెర్ట్జ్ హై రిఫ్రెష్ రేటు, ఐ ప్రొటెక్షన్, టీయూవీ సర్టిఫికేషన్, 4కే, ఎంఈఎంసీ టెక్నాలజీ, ఓఎల్ఈడీ స్క్రీన్, బిల్ట్ ఇన్ ట్యూనర్, హెచ్‌డీఆర్ ఇలా ఈ టీవీలో సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ట్రిక్రోమల్ లేజర్ టెక్నాలజీతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ ధర దాదాపు రూ. 5 లక్షలు. అలాగే ఈ టీవీలో జేబీఎల్ స్పీకర్ సిస్టమ్ కూడా ఉంటుంది. బిల్ట్ ఇన్ ఊఫర్ అమర్చారు. గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే ఈ లేజర్ టీవీపై మూడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. జూలై 15 నుంచి ఈ కొత్త స్మార్ట్ టీవీ అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇతర టీవీలు అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థల్లో, రిటైల్ స్టోర్స్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. https://t.me/offerbazaramzon
Search This Blog
Wednesday, July 12, 2023
హైసెన్స్ నుంచి 120 ఇంచుల స్మార్ట్ టీవీ !
Tags:
40 వాట్ స్పీకర్లు,
science,
technology,
ఈరోస్ నౌ,
జియో సినిమా,
జీ5,
డాల్బే ఆటమ్స్,
డాల్బే విజన్,
నెట్‌ఫ్లిక్స్,
పలు రకాల ఓటీటీ యాప్స్ చూడొచ్చు,
ప్రైమ్ వీడియో,
హైసెన్స్ నుంచి 120 ఇంచుల స్మార్ట్ టీవీ !
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment