Ad Code

సెకనుకు 20 ఫోన్లు చొప్పున అమ్ముడైన రియల్‌మీ సీ53 !


రియల్‌మీ ఇటీవల  సీ53 పేరుతో కొత్త ఫోన్ తెచ్చింది. జూలై 19న ఈ ఫోన్ యార్లీ బర్డ్ సేల్ జరిగింది. ఫోన్‌కు భారీ డిమాండ్ కారణంగా జనాలు ఎగబడి మరీ ఈ ఫోన్ కొన్నారు. ఎంతలా అంటే సెకన్‌కు 20 ఫోన్లు అమ్ముడు పోయాయి.  108 ఎంపీ కెమెరాతో తక్కువ ధరలో లభించే ఫోన్ ఇదే అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ స్లిమ్‌గా ఉంది. 7.99 ఎంఎం మందంతో ఉంటుంది. ఇంకా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు ఉంది. అలాగే 12 జీబీ డైనమిక్ ర్యామ్ ఫీచర్ ఉంది. అలాగే మెమరీ 128 జీబీ వరకు ఉంటుంది. ఇంకా ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. 18 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయెల్ రియర్ కెమెరా, వాటర్ డ్రాప్ నాచ్, ఆక్టో కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంటే ఫోన్‌లో సూపర్ డూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ స్క్రీన్ సైజ్ 6.74 ఇంచులు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేయనుంది. వెనుక భాగంలో 108 ఎంపీ, 2 ఎంపీ డ్యూయెల్ కెమెరా ఉండొచ్చు. ఫోన్ ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండొచ్చు. 4 జీ సపోర్ట్ చేస్తుంది. అందువల్ల బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కోరుకునే వారు ఈ ఫోన్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. ధర అందుబాటులో ఉంటే కొనుగోలు చేయొచ్చు. లేదంటే మార్కెట్‌లో పలు రకాల ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్‌లో నచ్చిన ఫోన్ ఎంపిక చేసుకోవచ్చు. దీని రేటు 9,999 నుంచి ప్రారంభం అవుతోంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. అదే 6 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ. దీని రేటు రూ.10,999గా ఉంది. ఇది బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఫోన్ తర్వాతి సేల్ జూలై 26న ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో లేదా కంపెనీ వెబ్‌సైట్‌ ఈ ఫోన్ కొనొచ్చు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu