Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Thursday, July 13, 2023

రూ. 20 లక్షలకే టెస్లా కారు !


దేశీయ మార్కెట్ లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ ఏర్పడింది.  దీంతో టెస్లా  భారత్ లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై చర్చలు జరుపుతోంది. టెస్లా వస్తే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పోటీ పెరుగుతుంది. దీంతో వినియోగదారుడికి మెరుగైన ఉత్పత్తులు, సేవలు అందించే వీలు కలుగుతుంది. గతంలో చైనాలో తయారైన కార్లను ఇండియాలో అమ్మాలని ఎలాన్ మస్క్ భావించాడు. అయితే కేంద్రం మేకిన్ ఇండియా ప్రోగ్రాంకు ప్రాధాన్యత ఇచ్చి, ఈ దేశంలో తయారైతేనే అమ్మకాలకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల అమెరికా వెళ్లిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తో చర్చలు జరిపారు. టెస్లా ఏడాదికి 5,00,000 ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు పోటీ ఇవ్వాలంటే భారతీయులకు తక్కువ ధరతో, ఎక్కువ ఫీచర్లు ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టెస్లా తన కార్లను రూ. 20 లక్షల నుంచి అందించాలని అనుకుంటోంది. ఇది భారతదేశ ఈవీ మార్కెట్ లో పోటీని పెంచే అవకాశం ఉంది. చైనా మాదిరిగానే భారత దేశాన్ని తన ఎగుమతులకు స్థావరంగా ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. స్థానికంగా టెస్లా కార్లను తయారు చేయడం ఇటు కంపెనీ, దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. మరోవైపు ఈవీ బ్యాటరీలకు అవసరమయ్యే లిథియం నిల్వలు భారతదేశంలో భారీ ఎత్తున వెలుగులోకి రావడం కూడా రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఊతం ఇవ్వనుంది. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts