Ad Code

26న శాంసంగ్ గెలాక్సీ మెగా ఈవెంట్ !


శాంసంగ్ ఈ నెల 26న 'గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్' నిర్వహిస్తోంది. లైవ్ కార్యక్రమంలో గెలాక్సీ జడ్ ఫోల్డ్5, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించనున్నది. ఈ మేరకు తాజా స్మార్ట్ ఫోన్ టీజర్లను వెబ్ సైట్ లోనూ, సోషల్ మీడియాలోనూ విడుదల చేసింది. ఈ టీజర్‌లో ఒక ఫ్లిప్ ఫోన్, మరొక ఫోల్డ్ ఫోన్, నోట్ బుక్, స్మార్ట్ వాచ్ కనిపిస్తున్నాయి. ఈ నెల 26న జరిగే ఆవిష్కరణలో గెలాక్సీ జడ్ ఫోల్డ్5, గెలాక్సీ జడ్ ఫ్లిప్5 స్మార్ట్ ఫోన్లతోపాటు ఇతర ఉత్పత్తుల్లో గెలాక్సీ టాబ్ ఎస్9 ఆల్ట్రా, గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్, గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ బడ్స్3 మార్కెట్లో ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. మెగా ఈవెంట్ సందర్భంగా శాంసంగ్.. తన కస్టమర్లకు పలు స్పెషలాఫర్లు కూడా తెచ్చింది. శాంసంగ్ ఆన్ లైన్ స్టోర్ ద్వారా ఈ ఉత్పత్తులు కొనుగోలు చేస్తే కొనుగోలుదారులు రూ.1999లకు రీఫండబుల్ ప్రీ-రిజర్వ్ పాస్, రూ.5000 విలువైన ఈ-ఓచర్ కొనుగోలు చేయొచ్చు. ఇక శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ ఫోన్లు వచ్చేనెల 14 నుంచి భారత్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. 7.6-అంగుళాల డైనమిక్ అమోలెడ్ డిస్ ప్లే వర్కింగ్ @ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ విత్ 2176 x1812 పిక్సెల్స్ రిజొల్యూషన్. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్ యూఐ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్. 256 జీబీ, 512 జీబీ, ఒక టిగా బైట్ స్టోరేజీ ఆప్షన్ మూడింటిలోనూ 12 జీబీ రామ్, బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ లెన్స్, 12 ఎంపీ అండర్ డిస్ ప్లే కెమెరా, 12 ఎంపీ కెమెరా ఆన్ సెకండరీ ప్యానెల్, 10 ఎంపీ + 4 ఎంపీ ఫర్ సెల్ఫీ అండ్ వీడియో కాలింగ్. 4400 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 55 వాట్ల హై స్పీడ్ చార్జింగ్ సపోర్ట్ ఫర్ చార్జింగ్. ఎన్ఎఫ్సీ, వై-ఫై 6ఈ, బ్లూ టూత్ 5.2, యూఎస్బీ సీ 3.2 పోర్ట్,

గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 లో 6.82 -అంగుళాల ఫుల్ హెచ్డీ + అమోలెడ్ డిస్ ప్లే వర్కింగ్ @ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్. 3.4 అంగుళాల ఫుల్ హెచ్డీ + డిస్ ప్లే విత్ 60 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ విత్ క్లాక్ స్పీడ్ 3.36 గిగా హెర్ట్జ్. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్ యూఐ 5.1 వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్. ట్రిపుల్ రేర్ కెమెరా ప్యానెల్.. 12 ఎంపీ ప్రైమరీ కెమెరా లెన్స్, 12 ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్ తోపాటు సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12 ఎంపీ కెమెరా. 8జీబీ రామ్ విత్ 256 జీబీ అండ్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లు. 4100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫర్ చార్జింగ్ 10 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందజేస్తారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu