Ad Code

జులై 26న శామ్‌సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ !


శామ్‌సంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను ఈ నెల 26న నిర్వహించనుంది. ఈ సందర్భంగా వివిధ ప్రొడక్ట్స్‌ను కంపెనీ పరిచయం చేయనుంది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ టీజర్‌ను శామ్‌సంగ్ తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో ఫోల్డబుల్ సిరీస్ ఫోన్ల కొత్త డిజైన్‌ను రివీల్ చేసింది. కంపెనీ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5  మోడళ్లను ఈ మెగా ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.  గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శామ్‌సంగ్ Galaxy Z Fold 5, Galaxy Z Flip 5 మోడళ్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. అలాగే Galaxy Watch 6 సిరీస్‌ను కూడా కంపెనీ పరిచయం చేయనుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో కర్వ్డ్ గ్లాస్, అప్‌గ్రేడ్ చేసిన బ్యాటరీ ఉండవచ్చు. కంపెనీ ఇదే ప్రోగ్రామ్‌లో Galaxy Tab S9 సిరీస్‌ను సైతం ఆవిష్కరించనుంది. అయితే వీటి ధర, స్పెసిఫికేషన్ల గురించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో రావచ్చిని లీక్ అయిన డేటా సూచిస్తోంది. 7.6 అంగుళాల ఫోల్డబుల్ AMOLED డిస్‌ప్లే, 6.2 అంగుళాల AMOLED కవర్ డిస్‌ప్లోతో ఫోన్ లాంచ్ కానుంది. 12 MP అల్ట్రా వైడ్ కెమెరా, 10 MP టెలిఫోటో కెమెరాలు ఉండే 50MP ప్రైమరీ సెన్సార్‌తో డివైజ్ రానుంది. లీక్‌ అయిన సమాచారం ప్రకారం, శామ్‌సంగ్ Z ఫ్లిప్ 5 ఫోన్ 3.4 అంగుళాల కవర్ డిస్‌ప్లేతో, అన్‌ఫోల్డ్ చేసినప్పుడు 6.7 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో రానుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో ఇది మంచి పనితీరును అందించనుంది. ఈ డివైజ్ డ్యుయల్ 12 MP కెమెరా సెటప్‌తో రానుంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ IP58 రేటింగ్‌తో రావచ్చని నివేదికలు పేర్కొన్నాయి. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను శామ్‌సంగ్ జులై 26న నిర్వహించనుంది. భారత్‌లో ఆరోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రోగ్రామ్ లైవ్ స్ట్రీమ్ ప్రారంభమవుతుంది. కంపెనీ మొదటిసారి తమ స్వదేశం అయిన దక్షిణ కొరియాలో ఈ ఈవెంట్‌ను నిర్వహించడం విశేషం. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్‌లో ప్రోగ్రామ్ లైవ్ స్ట్రీమ్ అవుతుంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu