Ad Code

దేశీయ మార్కెట్లో వివో వై 27 విడుదల


దేశీయ మార్కెట్లో వివో వై 27 పేరుతో కొత్త ఫోన్‌ను రిలీజ్‌ చేసింది. ముఖ్యంగా చార్జింగ్‌ విషయంలో వినియోగదారులకు మద్దతునిస్తూ ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి దూసుకువస్తుంది. వివో వై-27 లాంచ్‌తో దాని వై-సిరీస్‌కి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను జోడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లాస్ బాడీని కలిగి ఉంది. అలాగే ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్‌ చిప్‌సెట్‌తో పని చేసే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌ ధర కూ రూ.14,999గా ఉంటుంది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రెండు రంగు ఎంపికల్లో అందుబాటులో ఉంటుంది. బ్లాక్‌, గార్డెన్ గ్రీన్ రంగుల్లో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఇండియా ఈ-స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.  ఈ స్మార్ట్‌ ఫోన్‌ 1080×2388 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.64 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్‌ డిస్ప్లేతో వస్తుంది. అలాగే 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, గరిష్ట ప్రకాశాన్ని 600 నిట్‌ల వరకు అందిస్తుంది. 6 జీబీ + 128 జీబీ వేరియంట్లో వచ్చే ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్‌ హీలియక్ష జీ 85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6 జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌ మద్దతును కూడా అందిస్తుంది. ఈ ఫోన్‌ మెమరీని మైక్రో ఎస్‌డీ కార్డ్‌ని జోడించడం ద్వారా మరింత విస్తరించవచ్చు. ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను నడుస్తుంది. 50 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ బ్యాక్‌ కెమెరాలతో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో వస్తుంది. అలాగే సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వచ్చే ఈ ఫోన్లో 44 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu