Ad Code

హానర్ ప్లే 40C ఫోన్ విడుదల !


హానర్ నుంచి సరికొత్త హానర్ ప్లే 40C ఫోన్ లాంచ్ అయింది. ముందుగా చైనా మార్కెట్లో లాంచ్ కాగా, కంపెనీ ప్లే 40 సిరీస్‌కి లేటెస్ట్ ఎడిషన్ రిలీజ్ చేసింది. మొత్తం 3 విభిన్న కలర్ వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది. ఈ హ్యాండ్‌సెట్ 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు స్నాప్‌డ్రాగన్ 480 SoC ద్వారా పవర్ అందిస్తుంది. హానర్ ప్లే 40C ఫోన్ 6.56-అంగుళాల LCD డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,200mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. హానర్ ప్లే 40C మ్యాజిక్ నైట్ బ్లాక్, ఇంక్ జేడ్ గ్రీన్, స్కై బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.ఆండ్రాయిడ్ 13 ఆధారిత MagicOS 7.1పై స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. హానర్ ప్లే 40C ఫోన్ ఏకైక 6GB RAM, 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ధర CNY 899 (దాదాపు రూ. 10,300) లాంచ్ అయింది. ఈ ఫోన్ RAM విస్తరణ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. వినియోగదారులు 5GB వరకు ఉపయోగించని ఇంటర్నల్ స్టోరేజీని అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. ఆ మెమెరీని వర్చువల్ RAM మాదిరిగా ఉపయోగించవచ్చు. హానర్ హ్యాండ్‌సెట్ మ్యాజిక్ నైట్ బ్లాక్, ఇంక్ జేడ్ గ్రీన్, స్కై బ్లూ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. హానర్ చైనా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. కొత్తగా లాంచ్ అయిన హానర్ ప్లే 40C ఫోన్ Android 13-ఆధారిత MagicOS 7.1ని రన్ అవుతుంది. డ్యూయల్ SIM సపోర్టును అందిస్తుంది.1612×720 పిక్సెల్స్ రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 90Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కూడా అందిస్తుంది. 6GB RAMతో చేసిన ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 480 SoC, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ, Adreno 619తో రానుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. హానరే ప్లే 40C ఫోన్ 13MP ప్రైమరీ రియర్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ విషయానికి వస్తే.. హ్యాండ్‌సెట్ 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1, USB టైప్-C పోర్ట్, GPS, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. 5,200mAh బ్యాటరీని కలిగి ఉంది. అదనంగా, బయోమెట్రిక్ ఐడెంటిటీ ఫేస్ ఐడెంటిటీ ఫీచర్ కలిగి ఉంది. యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రొగ్సామిటీ సెన్సార్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. హానర్ ప్లే 40C ఫోన్ 163.32×75.07×8.35mm కొలతలు, 188 గ్రాముల బరువు ఉంటుంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu