Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Friday, July 14, 2023

పోకో ఎక్స్5 5జీ స్మార్ట్‌ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ !


ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ లాంటి అన్ని ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. పోకో ఎక్స్5 5జీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గడంతో పాటు, బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తోంది. పోకో ఎక్స్5 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.14,999 ధరకు, 8జీబీ+256జీబీ 256జీబీ వేరియంట్ రూ.16,999 ధరకు లిస్ట్ అయింది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ ధర కన్నా రూ.4,000 తక్కువకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ కలిపితో మొత్తం రూ.5,000 డిస్కౌంట్ పొందొచ్చు. బ్యాంక్ ఆఫర్స్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.13,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.15,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. అంటే రిలీజ్ ధర కన్నా ఏకంగా 25 శాతం తగ్గింపు లభిస్తోంది. పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేసేవారికి రూ.14,000 పైనే ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈఎంఐ ఆఫర్ ద్వారా కొనాలనుకునేవారికి ఈఎంఐ ఆప్షన్ రూ.528 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సూపర్‌నోవా గ్రీన్, జాగ్వార్ బ్లాక్, వైల్డ్‌క్యాట్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ లభిస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది పాపులర్ 5జీ ప్రాసెసర్. 48మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ లెన్స్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. ఇందులో టర్బో ర్యామ్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో అదనంగా 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. అంటే గరిష్టంగా 13జీబీ వరకు ర్యామ్ ఉపయోగించవచ్చు.    https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts