Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, July 12, 2023

హెచ్‌పీ ఐమ్యాక్స్ ల్యాప్‌టాప్‌ విడుదల !


దేశీయ మార్కెట్లో  హెచ్‌పీ ఎన్ వీ ఎక్స్360 15 సిరీస్ ల్యాప్టాప్ లు లాంచ్ అయ్యాయి. ఇందులో 15.6 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లే, 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఉంది. ఇంటెల్, ఏఎండీ రైజెన్ ప్రాసెసర్లతో ఈ ల్యాప్టాప్ వచ్చింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 15 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ను ఇవి అందించనున్నాయి. వైఫై 6ఈ, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఐమ్యాక్స్ ఎన్హేన్స్డ్ డిస్ప్లే సర్టిఫికేషన్ తో హెచ్ పీ లాంచ్ చేసిన మొదటి ల్యాప్టాప్లు ఇవే. అంటే ఇవి ఐమ్యాక్స్ ఫార్మాట్ సినిమాలను, సీన్లను మరింత ఎక్కువ యాస్పెక్ట్ రేషియోతో ఈ ల్యాప్టాప్ ల్లో చూడవచ్చు. దీని ధర రూ.78,999 నుంచి ప్రారంభం కానుంది. హెచ్పీ ఆన్లైన్ స్టోర్, హెచ్పీ వరల్డ్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రాసెసర్, స్టోరేజ్, వేరియంట్ను బట్టి దీని ధర మారుతూ ఉంటుంది. ఐమ్యాక్స్ ఎన్హేన్స్డ్ డిస్ ప్లేతో హెచ్పీ లాంచ్ చేసిన హెచ్ పీ లాంచ్ చేసిన మొదటి సిరీస్ ల్యాప్టాప్ లు ఇవే. 13వ తరం ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, ఏఎండీ రైజెన్ 7000 సిరీస్ ప్రాసెసర్లు ఇందులో ఉన్నాయి. ఎన్వీడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 3050 ఆర్టీఎక్స్ 3050 లేదా ఏఎండీ రేడియోన్ గ్రాఫిక్స్ కార్డులు కూడా అందించారు. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ లో 15.6 అంగుళాల ఓఎల్ఈడీ టచ్స్క్రీన్ డిస్ప్లేను అందించారు. ఐసేఫ్ సర్టిఫికేషన్ ఫీచర్ కూడా ఈ టీవీలో ఉంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో కూడా ఇందులో ఉంది. 5 మెగాపిక్సెల్ కెమెరా ద్వారా ఈ ల్యాప్టాప్ లో వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు, మీటింగ్లకు అటెండ్ అవ్వవచ్చు. ఫిజికల్ ఎమోజీ మెనూ కూడా హెచ్పీ ఎన్వీ ఎక్స్360 సిరీస్ లో అందించారు. హెచ్పీ క్విక్డ్రాప్ టెక్నాలజీ కూడా ఈ ల్యాప్టాప్ లో ఉంది. బ్లూటూత్ 5.3, వైఫై 6ఈ సపోర్ట్, యూఎస్ బీ టైప్-సీ పోర్టులు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ పెడితే 15 గంటల బ్యాకప్ను ఈ ల్యాప్టాప్ అందించనుంది. కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ ఎక్కనుంది. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts