Ad Code

పీసీలోనూ మొబైల్ గేమ్స్ ?


మొబైల్‌కి మాత్రమే పరిమితమైన గేమ్స్‌ని ఇక నుంచి పర్సనల్ కంప్యూటర్స్‌లలోనూ ఆడే అవకాశం రానుంది. దేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌కి క్రమంగా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్ వినూత్న నిర్ణయం తీసుకుంది. మొబైల్ వెర్షన్ గేమ్స్‌ని పీసీల్లో కూడా ఆడే వీలు కల్పిస్తూ 'గూగుల్ ప్లే గేమ్స్'ని తీసుకొచ్చింది. ఈ స్టోర్‌లో నుంచి గేమింగ్ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఎంచక్కా ఆడుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. బిగ్ స్క్రీన్‌పై గేమ్‌లను ఆడుతుంటే ఆ కిక్కే వేరు. మౌస్, కీ బోర్డ్ షార్ట్‌కట్స్‌తో బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ పొందవచ్చు. ఈ కల తొందర్లోనే నెరవేరనుంది. బీటా వెర్షన్ కోసం యూజర్లు అప్లై చేసుకునే సదుపాయాన్ని గూగుల్ కల్పిస్తోంది. ఇందులో చేరిన వారు మొబైల్ గేమ్స్‌ని టాబ్లెట్, పీసీలు, క్రోమ్‌బుక్స్‌లలో ఆడుకోవచ్చు. భారత్‌లోని యూజర్లకు హిందీ, ఇంగ్లీష్‌లలో అందుబాటులో ఉన్నాయని గూగుల్ ఓ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ప్లేయర్లకు అత్యద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ కల్పించడానికి వివిధ ఫీచర్లను ఇందులో ఎనేబుల్ చేసినట్లు గూగుల్ వెల్లడించింది. ఎన్నో మొబైల్ గేమ్స్‌ దేశంలో పాపులారిటీని సంపాదించాయి. లూడో కింగ్, హిట్‌వికెట్ గేమ్స్, ఎవర్‌సోల్, లార్డ్స్ మొబైల్, ఎవనీ: ద కింగ్స్ రిటర్న్ వంటి పేరొందిన, వైవిధ్యభరితమైన గేమ్స్‌ని యూజర్లు పీసీలో ఆడుకోవచ్చు. పైగా, సింక్రనైజేషన్ ఫీచర్ ఉండటంతో మొబైల్‌లో ఎక్కడైతే గేమ్‌ని ఆపామో.. బిగ్ స్క్రీన్ డివైజ్‌లలో ఓపెన్ చేసినప్పుడు అక్కడి నుంచే మొదలు పెట్టవచ్చు. దీంతో పాటు మరింత విస్తృతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని కల్పించడానికి గూగుల్ కొత్త ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేసింది. కీ బోర్డ్ రీమ్యాప్పింగ్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇష్టమొచ్చినట్లు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. https://t.me/offerbazaramzon

గూగుల్ ప్లే గేమ్స్‌ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయడానికి గూగుల్ మరో అడుగు ముందడుగు వేసింది. గేమింగ్‌కి సపోర్ట్ చేసేందుకు అవసరమైన పీసీ స్పెసిఫికేషన్లను తగ్గించింది. దీంతో తక్కువ స్పెషిఫికేషన్లు ఉన్న పీసీల్లోనూ వివిధ గేమ్స్ ఆడుకోవచ్చు. అయితే, మొబైల్ గేమ్స్‌తో పీసీ కంపాటబుల్ కావాలి. దీంతో పాటు సదరు మొబైల్ గేమ్స్ పీసీ వెర్షన్‌లోనూ అందుబాటులో ఉండాలి. కంపాటబుల్ కావడానికి పీసీకి కొన్ని స్పెసిఫికేషన్లు ఉండాలి. విండోస్ 10(v2004) ఆపరేటింగ్ సిస్టం, అదనంగా 10GB SSD స్టోరేజీ స్పేస్ అందుబాటులో ఉండాలి. ఇంటెల్ యుహెచ్‌డీ గ్రాఫిక్స్ 630 GPU లేదా సమానమైన గ్రాఫిక్స్ ఉండాలి. కనీసం 8GB RAM, హార్డ్‌వేర్ వర్చువలైజేషన్ ఆన్ చేసి ఉండాలి. ఇక, ప్రాసెసర్ విషయానికి వస్తే.. కనీసం 4 సీపీయూ ఫిజికల్ కోర్స్ ఉండాల్సి ఉంటుంది. బీటా వెర్షన్‌లో చేరాలనుకునే వారు g.co/googleplaygamesని విజిట్ చేయొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu