Ad Code

హీరో స్పెండర్ ఎలక్ట్రిక్ బైక్


హీరో మోటొకార్ప్ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ విదా వీ1 కూడా మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ మీద కూడా పని చేస్తున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. ముఖ్యగా  స్పెండర్ లో ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లోకి రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. హీరో  స్పెండర్ దేశంలోనే బెస్ట్ సెల్లింగ్ బైక్‌గా కొనసాగుతూ వస్తోంది. జనాలు ప్రతి నెలా ఎక్కువగా కొనే బైక్ ఇదే కావడం గమనార్హం. అందువల్ల కంపెనీ  స్పెండర్ లోనే ఎలక్ట్రిక్ వేరియంట్ తీసుకువస్తే.. అమ్మకాలు కూడా భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. బ్రాండ్ ఇమేజ్ దీనికి దోహదపడొచ్చు. అంతేకాకుండా అదిరే ఫీచర్లతో కంపెనీ ఎలక్ట్రిక్  స్పెండర్ బైక్ తీసుకురావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ధర కూడా అందుబాటులో ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే హీరో ఎలక్ట్రిక్ స్ల్పెండర్ బైక్ దుమ్ము రేపొచ్చు. హీరో ఎలక్ట్రిక్  స్పెండర్ బైక్‌ ఒక్కసారి చార్జింగ్ పెడితే 240 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చనే అంచనాలు ఉన్నాయి. కంపెనీ ఇందులో పలు రకాల వేరియంట్లు అందుబాటులో ఉండొచ్చు. 4 కేడబ్ల్యూ నుంచి 9 కేడబ్ల్యూ వరకు కెపాసిటీతో బ్యాటరీని అమర్చొచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ కూడా గంటకు 100 కిలోమీటర్లు ఉండొచ్చు. అలాగే కంపెన ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో అదనంగా 2 కేడబ్ల్యూ బ్యాటరీని అమర్చేలా ఫీచర్‌ ఏర్పాటు చేయొచ్చు. దీని వల్ల బైక్ రేంజ్ మరింత పెరుగుతుంది. అంతేకాకుండా ఈ బైక్ ధర విషయానికి వస్తే.. రూ. లక్ష నుంచి ప్రారంభం కావొచ్చనే అంచనాలు ఉన్నాయి. వేరియంట్ ఆధారంగా బైక్ ధర మారుతుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu