Ad Code

మైక్రోసాఫ్ట్ లో మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు !


మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున మరోసారి ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది జనవరిలో 10,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించింది మైక్రోసాఫ్ట్. వీటికి అదనంగా మరికొంత మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి వారం నుంచే ఈ తొలగింపులు ప్రారంభించింది. తాజా తొలగింపుల్లో భాగంగా యూఎస్ వాషింగ్టన్ లోని ఆఫీసులో ఉద్యోగులపై ప్రభావం పడింది. ఉద్యోగుల్లో 276 మందిని తొలగించింది. అందులో 66 మంది వర్చువల్ గా పనిచేస్తున్న వారు ఉన్నారు. వీరిలో సేల్స్, కస్టమర్ సక్సెస్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. తామంతా ఉద్యోగులు కోల్పోయామని లింక్డ్‌ఇన్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంల ద్వారా వెల్లడిస్తున్నారు. మాజీ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఉద్యోగాల కోసం లింక్డ్‌ఇన్ వెబ్‌సైట్ ద్వారా వెతుకుతున్నారు. తమ క్లౌడ్ కంప్యూటింగ్ బిల్లులో ఖర్చులను తగ్గించుకునేందుకు లేఆఫ్స్ తీసుకువచ్చినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించించింది. రానున్న రోజుల్లో మరింత మందిని తొలగిస్తామని సంస్థ ప్రకటించింది. అయితే ఈ సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. ''మా వ్యాపార నిర్వహణలో సంస్థాగత మరియు శ్రామిక శక్తి సర్దుబాట్లు తప్పనిసరి మరియు క్రమమైన భాగం. మేము మా భవిష్యత్తు కోసం మరియు మా కస్టమర్‌లు మరియు భాగస్వాములకు మద్దతుగా వ్యూహాత్మక వృద్ధి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తాము'' అని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు, మారుతున్న కస్టమర్ల ప్రాధాన్యతల దృష్ట్యా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ గత కొన్ని నెలలుగా Xbox, HoloLens, LinkedIn మరికొన్ని విభాగాల్లో ఉద్యోగులను తొలగించుకుంటూ వస్తోంది. AI టెక్నాలజీ ముఖ్యంగా బింగ్ చాట్ లో ఎక్కువ పెట్టుబడులు పెడుతోంది. ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు మెటా, గూగుల్, ట్విట్టర్, అమెజాన్ వంటి సంస్థలు వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్ ట్రాకర్ Layoff.fyi ప్రకారం, 839 టెక్ కంపెనీలు 2023లో మొత్తం 2,16,328 మంది ఉద్యోగులను తొలగించాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu