Ad Code

జీమెయిల్ లో ఎన్‌హాన్స్‌డ్‌ సేఫ్ బ్రౌజింగ్ సెక్యూరిటీ టూల్‌ !


గూగుల్ తీసుకొచ్చిన జీమెయిల్‌ ను అందరూ ఉపయోగిస్తుంటారు. ఈ యాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుంటుంది. సెక్యూరిటీ అప్‌డేట్స్‌ కూడా అందిస్తుంది. గూగుల్ ఇటీవల జీమెయిల్ ఆండ్రాయిడ్‌ యాప్‌లో "ఎన్‌హాన్స్‌డ్‌ సేఫ్ బ్రౌజింగ్" అనే మరో కొత్త సెక్యూరిటీ టూల్‌ను పరిచయం చేసింది. మొబైల్ యాప్ యూజర్లకు పెద్ద సమస్యగా మారిన హానికరమైన ఈమెయిల్స్‌, ముఖ్యంగా ఫిషింగ్ దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ అప్‌డేట్‌ను ఆఫర్ చేసింది. దీనిని ఎనేబుల్ చేయాలని కూడా యూజర్లకు తరచుగా నోటిఫికేషన్ పంపిస్తోంది. ఎన్‌హాన్స్‌డ్‌ సేఫ్ బ్రౌజింగ్ ఫీచర్ ఇంటర్నెట్, జీమెయిల్ యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు యూజర్లను సేఫ్‌గా ఉంచుతుంది. మొదటిసారిగా 2020లో గూగుల్ క్రోమ్‌లో పరిచయమైన ఈ స్పెసిఫికేషన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ జీమెయిల్ యాప్‌కి రిలీజ్ అవుతోంది. వెబ్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు లేదా ఈ-మెయిల్స్‌ను చెక్ చేస్తున్నప్పుడు ఫిషింగ్ వంటి హానికరమైన అటాక్స్ నుంచి ESB యూజర్లకు రక్షణ కల్పిస్తుంది. జీమెయిల్‌లోని ఎన్‌హాన్స్‌డ్‌ సేఫ్ బ్రౌజింగ్ ఎనేబుల్ చేస్తే, అది ఈమెయిల్స్‌లోని ఫిషింగ్ సైట్లు, ఇతర హానికరమైన సైట్స్ మానిటర్ చేయగలదు. వాటినుంచి యూజర్లను దూరంగా ఉంచగలదు. ఈ టూల్ మెరుగైన రక్షణను అందించడానికి గూగుల్ క్రోమ్, గూగుల్ డ్రైవ్ వంటి ఇతర యాప్‌లతో కలిసి పని చేస్తుంది. ఈమెయిల్స్‌లో కనిపించే డేంజరస్ వెబ్‌సైట్‌ను తెరవడానికి, హానికరమైన లింక్‌ను క్లిక్ చేయడానికి లేదా ఎక్స్‌టెన్షన్ డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే వెంటనే వార్నింగ్ ఇస్తుంది. ఈమెయిల్ అటాచ్‌మెంట్స్ అన్ని స్కాన్ చేస్తుంది. హ్యాకర్లు ఈమెయిల్స్‌లోని పర్సనల్ ఇన్ఫర్మేషన్ దొంగలించకుండా ఆపుతుంది. వివిధ గూగుల్ యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు కూడా ESB సెక్యూరిటీని మెరుగుపరుస్తుంది. వెబ్‌లో ఏయే వెబ్‌సైట్స్ మాల్వేర్స్‌ హోస్ట్ చేస్తున్నాయో గుర్తించి, వాటి నుంచి రక్షణ కల్పిస్తూ ఇంటర్నెట్‌ను సురక్షితమైన ప్రదేశంగా మారుస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌ యూజర్లు జీమెయిల్ యాప్ ఓపెన్ చేయాలి. ఫీచర్‌ని ఎనేబుల్ చేయమని అడుగుతూ ఒక పాప్-అప్ మెసేజ్ కనిపిస్తే దానిపై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదంటే జీమెయిల్ యాప్‌లో లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఉన్న హ్యాంబర్గర్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. సెట్టింగ్స్‌కు వెళ్లాలి. అక్కడ జనరల్ సెట్టింగ్స్ కింద xxx@gmail.com అంటూ జీమెయిల్ అకౌంట్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అకౌంట్‌ సెక్షన్‌లో మేనేజ్ యువర్ అకౌంట్ ఆప్షన్‌పై నొక్కాలి. సెక్యూరిటీ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. కిందకు స్క్రోల్ చేస్తూ ఉంటే "ఎన్‌హాన్స్‌డ్‌ సేఫ్ బ్రౌజింగ్" ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎనేబుల్ చేసుకోవాలి. ఈ టూల్‌ యూజర్లకు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటుంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu