Ad Code

యాపిల్‌ వాచ్‌లో క్రానిక్‌ హార్ట్‌ కండిషన్‌ ఈజీ ట్రాక్‌ !


యాపిల్‌ వాచ్‌ భారత వినియోగదారులకు చక్కటి ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. గుండెకు స్పందలను సంబంధించిన హిస్టరీని ట్రాక్‌ చేయవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లకు అందుబాటులో ఉంది. తాజా నివేదికల ప్రకారం భారతీయ ఆపిల్ వాచ్ వినియోగదారులు కూడా ఇప్పుడు ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు. AFib అనేది క్రానిక్‌ హార్ట్‌ కండిషన్‌ను సూచిస్తుంది. ఇది ఒక రకమైన అరిథ్మియా. గుండె దడ, వేగంగా, క్రమరహితంగా కొట్టుకోవడం. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకుండా, సరియైన చికిత్స తీసుకోకుండా ఉంటే మాత్రం గుండె ఆగిపోవడానికి లేదా స్ట్రోక్‌ సంభవించే క్లాట్స్‌కు దారితీస్తుంది. అయితే దీనికి సరియైన మందులువాడే వ్యక్తులు ఆరోగ్య కరమైన, చురుకైన జీవితాలను గడపొచ్చు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గుండె-ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన బరువు, ఇతర వైద్య చికిత్స తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. యాపిల్‌వాచ్‌ 4, తర్వాత వాచ్‌ ఏఓస్‌ 9లోని వినియోగదారులకు ఈ ఫీచర్‌ పని చేస్తుంది. భారతదేశంలోని వాచ్ యూజర్లు ఐఫోన్‌లో ఐఓఎస్‌ 16ని ఉపయోగించాలి.  AFib హిస్టరీ ఖచ్చితంగా 22 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే అని యాపిల్‌ సపోర్ట్‌ పేజీ స్పష్టం చేసింది. ఐఫోన్‌లో హెల్త్‌యాప్‌ ఓపెన్‌, బ్రౌజ్ క్లిక్‌ చేసిన హార్ట్‌ ఆప్షన్‌నుఎంచుకోవాలి. AFib హిస్టరీ సెట్‌ చేసిన స్టార్ట్‌ అప్షన్‌పై క్లిక్‌ చేయాలి. మీ పుట్టిన తేదీని నమోదు చేయండి. AFibతో బాధపడుతున్నారని వైద్యుడు నిర్ధారించిన వైనాన్ని ధృవీకరించాలి. తరువాత AFib చరిత్ర, ఫలితాలు , లైఫ్‌ ఫ్యాక్ట్‌ గురించి మరింత తెలుసుకునేలా కంటిన్యూపై క్లిక్‌ చేయాలి.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu