Ad Code

ట్రూ కాలర్ అసిస్టెంట్ ఫీచర్​ !


ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కాలర్​ ఐడీ యాప్ ట్రూ కాలర్​. దీనిని చాలా మంది వాడుతుంటారు. మన కాంటాక్ట్​ లిస్ట్​లో పేరు లేని వ్యక్తులు కాల్ చేసినప్పుడు  వారి వివరాలను తెలియజేస్తుంది ట్రూ కాలర్. ఫోన్​ రింగ్​ అవడానికి ముందే ఎవరు కాల్​ చేస్తున్నారో చెప్పేస్తుంది​. అయితే భారత్​లో ట్రూకాలర్ ​యాప్​లో ఫ్రాడ్​, స్పామ్ కాల్స్​ను నిలువరించేందుకు ట్రూకాలర్ అసిస్టెంట్​ అనే కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. ట్రూకాలర్ అసిస్టెంట్ కస్టమర్లకు డిజిటల్ రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తుంది. అపరిచిత వ్యక్తులు నుంచి, స్పామ్​ కాల్స్ వచ్చినప్పుడు ట్రూకాలర్ అసిస్టెంట్ కాల్ ఆన్సర్​ చేస్తుంది. అవతలి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో లైవ్​లో మొబైల్​ స్క్రీన్​పై టెక్స్ట్​ రూపంలో చూపిస్తుంది. అప్పుడు ఆ సంభాషణకు చూసి కాల్​ను మాట్లాడాలా, వద్దా అనేది వినియోగదారులు నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ట్రూకాలర్ కొత్త ఫీచర్​ భారతీయ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. 'ఇప్పటివరకు ఎవరు కాల్ చేస్తున్నారో ట్రూకాలర్ మీకు చూపించింది. కానీ ఇప్పుడు మీరు మీ తరఫున కాల్ చేసిన వ్యక్తితో సంభాషిస్తుంది. స్పామ్, ఫ్రాడ్ కాల్స్​ను నిలువరించడంలో కస్టమర్లకు బాగా సాయం చేస్తుంది. భారత్​లోని ట్రూకాలర్ యాప్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.' అని ట్రూకాలర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రిషిత్ జున్‌జున్‌వాలా ఈ కొత్త ఫీచర్​ గురించి వివరించారు. 14 రోజుల ఉచిత ట్రయల్‌లో భాగంగా ట్రూకాలర్ అసిస్టెంట్​ను ఆ సంస్థ భారతీయ వినియోగదారులకు పరిచయం చేసింది. ఈ ప్రారంభ వ్యవధి తర్వాత.. చందాదారులు నెలకు రూ. 149 ప్రీమియం చెల్లించి ట్రూకాలర్ అసిస్టెంట్​ను వాడుకోవచ్చు. ట్రూకాలర్ అసిస్టెంట్ ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది. భారతీయ వినియోగదారుల కోసం ఇంగ్లీష్, హిందీ భాషల్లో గూగుల్ అసిస్టెంట్ పనిచేస్తుందని ట్రూకాలర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రిషిత్ జున్​జున్​వాలా తెలిపారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu