Ad Code

డెడ్ శాటిలైట్‌ కూల్చివేత !


ప్రపంచ చరిత్రలో తొలిసారిగా డెడ్‌ శాటిలైట్‌ను భూమిపైకి తెచ్చి కూల్చివేశారు. ఏయోలస్ అనే 1,360 కిలోల బరువున్న వాతావరణ పర్యవేక్షణ అంతరిక్ష నౌకను 2018లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించింది. ఇటీవల ఈ మిషన్‌ కాలపరిమితి ముగిసింది. దీంతో డెడ్‌ అయిన ఈ శాటిలైట్‌ 200 మైళ్లు (సుమారు 320 కిలోమీటర్ల ) ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతోంది. అయితే ఇందులో నియంత్రిత పద్ధతిలో భూమి వాతావరణంలోకి వచ్చి కూలిపోయే ఏర్పాట్లను చేయలేదు. గత కొన్ని నెలలుగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) ఇతర సంస్థలతో కలిసి శాటిలైట్‌ కక్ష్యను తగ్గించే చర్యలు చేపట్టింది. క్రమంగా ఉపగ్రహం ఎత్తు తగ్గిస్తూ 120 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకొచ్చారు. ఈ నెల 24న ఆ డెడ్‌ శాటిలైట్‌ అట్లాంటిక్ మహాసముద్రంలో సురక్షితంగా కూలింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu