Ad Code

ఒబెన్ కంపెనీ రోర్ ఎలక్ట్రిక్ బైక్ !


బెన్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ రోర్ పేరుతో అదిరే ఎలక్ట్రిక్ బైక్‌ను అందిస్తోంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 100 కి.మి. ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఏకంగా 187 కిలోమీటరల్ వెళ్తుంది. బ్యాటరీ 80 శాతం ఫుల్ కావడానికి 2 గంటలు పడుతుంది. కేవలం 3 సెకన్లలోనే ఈ బైక్ 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. నియో క్లాసిక్ డిజైన్‌తో ఈ బైక్ స్టైలిష్‌గా ఉంది. డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, థెఫ్ట్ ప్రొటెక్షన్, వాటర్ రెసిస్టెంట్ బ్యాటరీ, జీపీఎస్, హై గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బ్యాటరీపై మూడేళ్ల వారంటి ఉంటుంది. మోటార్‌పై కూడా 3 ఏళ్ల వారంటీ ఉంది. ఉచితంగా మూడు సర్వీసులు లభిస్తాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. మీరు మీ బైక్ స్టాట్స్‌ను యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,49,999. మీరు రూ. 30 వేల డౌన్ పేమెంట్‌తో కూడా దీన్ని కొనొచ్చు. మిగతా మొత్తం రూ. 1,19,999 లోన్ రూపంలో పొందొచ్చు. వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది. అంటే నెల వారీ ఈఎంఐ రూ. 5454గా ఉంటుంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. కాగా బైక్ ధరకు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ వంటివి అదనంగా ఉంటాయి. అందువల్ల వీటిని కూడా కలుపుంటే బైక్ ధర ఇంకా ఎక్కువగా ఉంటుంది. కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయొచ్చు. లేదటే ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు. కాగా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీస్‌ను ఈ నెల నుంచే ప్రారంభించనుంది. అందువల్ల బైక్ కొన వారు కొనుగోలు చేయొచ్చు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu