Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Wednesday, July 26, 2023

ఏఐతో కొలువుల కోత తప్పదన్నసామ్ ఆల్ట్‌మన్‌ !


చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ ఏఐ టూల్స్‌పై బాంబు పేల్చారు. వీటిపై కఠిన నియంత్రణలు అవసరమని పలు వేదికలపై వెల్లడించిన సామ్ లేటెస్ట్‌గా ఏఐతో కొలువుల కోత తప్పదని మరోసారి తేల్చిచెప్పారు. చాట్‌జీపీటీ సమాధానాల్నింటినీ తాను అంగీకరించనని భారత్ పర్యటన సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ది అట్లాంటిక్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏఐ టూల్స్ కొన్ని ఉద్యోగాలకు ఎసరు పెడతాయని పేర్కొన్నారు. ఏఐపై పనిచేస్తున్న ఎంతోమంది రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీతో మనిషికి మేలు జరుగుతుందని చెప్పినా అది పూర్తిగా నిజం కాదని చెప్పారు. ఏఐ మనుషులకు సప్లిమెంట్ మాత్రమేనని, దీని ద్వారా ఎలాంటి ఉద్యోగాలు రీప్లేస్ కావని నమ్మడం సరైంది కాదని తేల్చిచెప్పారు. న్యూ టెక్నాలజీతో ఉద్యోగాలు కచ్చితంగా కనుమరుగవుతాయని స్పష్టం చేశారు. చాట్‌జీపీటీ కంటే మరింత శక్తివంతమైన టూల్‌ను ఓపెన్ఏఐ క్రియేట్ చేస్తుందని కానీ అంతటి సాంకేతిక ముందడుగుని ప్రజలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండబోరని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ ఫలితాలు ఊహించేందుకు కూడా మనస్కరించవని ఆల్ట్‌మన్ అన్నారు. భవిష్యత్తులో శక్తివంతమైన కొత్త మేధస్సు మానవులతో సహజీవనం చేయవచ్చని, చాట్‌జీపీటీ అనేది దీనికి ముందస్తు సంకేతమనే ఆలోచనను అర్థం చేసుకోవడానికి ప్రజలకు సమయం పడుతుందని ది అట్లాంటిక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆల్ట్‌మన్ చెప్పుకొచ్చారు. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts