* "K" కీ నొక్కితే యూట్యూబ్ వీడియోను పాజ్ చేయవచ్చు. అదే కీని మళ్లీ ప్రెస్ చేస్తే ప్లేబ్యాక్‌ను రెస్యూమ్ చేయవచ్చు. వీడియోలు చూస్తున్నప్పుడు కాల్స్ వచ్చినా లేదా అంతరాయాలు కలిగినా వీడియోను హోల్డ్ చేసి, అక్కడి నుంచే మళ్లీ మొదలు పెట్టడానికి ఈ షార్ట్‌కట్ వాడవచ్చు. స్పేస్‌బార్‌పై నొక్కినా వీడియో పాజ్ అవుతుంది.
* వీడియోను 10 సెకన్ల పాటు ఫార్వర్డ్ చేయడానికి కీబోర్డ్‌లో "l" కీ ప్రెస్ చేయవచ్చు. దీనికి బదులుగా "రైట్ యారో" పై క్లిక్ చేసి 5 సెకన్స్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు.
* వీడియోను 10 సెకన్లు వెనక్కు తీసుకెళ్లడానికి "j" బటన్ నొక్కాలి. వీడియోలు చూస్తున్నప్పుడు రివైండ్ చేయడానికి ఈ షార్ట్‌కట్ ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి బదులుగా "లెఫ్ట్ యారో" పై క్లిక్ చేసి 5 సెకన్స్ రివైండ్ చేసుకోవచ్చు.
* వీడియోను మ్యూట్ చేయడానికి "m" కీని నొక్కాలి. అన్‌మ్యూట్ చేయడానికి, అదే కీపై క్లిక్ చేయాలి.
* వీడియోల ప్లేబ్యాక్ వేగాన్ని పెంచడానికి, ">" కీపై క్లిక్ చేయాలి. తక్కువ సమయంలో ఎక్కువ వీడియోలను త్వరగా చూడటానికి ఈ షార్ట్‌కట్ వాడొచ్చు. "<" క్లిక్ చేసి, ప్లేబ్యాక్ స్పీడ్ తగ్గించుకోవచ్చు.
* యూట్యూబ్ గంటల కొద్దీ చూస్తున్నప్పుడు ప్లేలిస్ట్‌లో నెక్స్ట్ వీడియోకి వెళ్లడానికి Shift + N నొక్కితే సరిపోతుంది. ప్లేలిస్ట్ వీడియోస్ కాకుండా మామూలుగా వీడియోస్ చూస్తుంటే, నెక్స్ట్ సజెస్టెడ్ వీడియోకి వెళ్లడానికి ఈ షార్ట్‌కట్ పనికొస్తుంది.
* ప్రీవియస్ వీడియోకి తిరిగి వెళ్లడానికి కీబోర్డ్‌లో Shift + P నొక్కాలి. ప్లేలిస్ట్‌లో వీడియోను చూస్తున్నప్పుడు మాత్రమే ఈ షార్ట్‌కట్ పని చేస్తుంది.
* వీడియోలోని నిర్దిష్ట పాయింట్‌కి స్కిప్ చేయడానికి, 10% రేట్‌తో ముందుకు వెళ్లడానికి 1 - 9 మధ్య ఏదైనా కీ నొక్కవచ్చు. ఉదాహరణకు, వీడియోలోకి 80% వెళ్లడానికి 8ని నొక్కాలి. 0 బటన్ ప్రెస్ చేస్తే, వీడియోను స్టార్టింగ్ నుంచి చూడవచ్చు
* థియేటర్ మోడ్ కోసం T, ఫుల్ స్క్రీన్ కోసం F, ఫుల్‌స్క్రీన్ ఎగ్జిట్‌కి Esc, క్యాప్షన్స్ కోసం C బటన్స్ క్లిక్ చేయాలి. https://t.me/offerbazaramzon
No comments:
Post a Comment