ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి, సెర్చ్ బార్‌లో "ChatGPT" అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. సెర్చ్ రిజల్ట్స్‌లో ChatGPT యాప్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయాలి. అప్పుడు యాప్ నేమ్ ChatGPT కిందే OpenAI అని కనిపిస్తుంది. తద్వారా అది అఫీషియల్ యాప్ అని అర్థం చేసుకోవచ్చు. ఈ యాప్ జులై 21న రిలీజ్ అయింది, జులై 26న అప్‌డేట్ అయింది. ఈ వివరాలను అబౌట్ థిస్ యాప్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. అఫీషియల్ యాప్ అని నిర్ధారించుకున్న తర్వాత ChatGPT డౌన్‌లోడ్ చేసి లాంచ్ చేయాలి. సైన్-ఇన్ కావడానికి పలు రకాల మెథడ్స్ కనిపిస్తాయి. అందులో కంటిన్యూ విత్ గూగుల్ లేదా ఇతర లాగిన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ChatGPT వెబ్ వెర్షన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఉపయోగించిన అదే ఈమెయిల్ ఐడీతో కూడా లాగిన్ చేయవచ్చు. ఇప్పుడు క్వశ్చన్లు అడగడానికి, రెస్పాన్స్‌లు స్వీకరించడానికి ఆండ్రాయిడ్ ఫోన్‌లో చాట్‌జీపీటీని వాడటం మొదలుపెట్టొచ్చు.
ఐఫోన్‌లో యాప్ స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో "ChatGPT" అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. సెర్చ్ రిజల్ట్స్‌లో అఫీషియల్ ChatGPT యాప్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడానికి పక్కనే కనిపించే "గెట్" బటన్‌పై క్లిక్ చేయాలి. ఇన్‌స్టాలేషన్ పూర్తయ్యాక ChatGPT యాప్‌ని ఓపెన్ చేసి లాగిన్ కావాలి. అంతే, ఇప్పుడు చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయవచ్చు. https://t.me/offerbazaramzon
No comments:
Post a Comment