Ad Code

అమెజాన్ వన్‌ పామ్ పేమెంట్ !


మెజాన్ వన్‌ పామ్ పేమెంట్ తో ఏం చక్కా చెల్లింపులు చేసేయొచ్చు. ఆయా గ్రాసరీ స్టోర్లు, హోటల్స్‌, ఫుడ్ కోర్టులు, ఇతర ప్రదేశాల్లో మనక్కావాల్సింది కొనుక్కున్నాక, పేమెంట్స్ సెక్షన్ దగ్గర `స్కానింగ్‌` డివైజ్ మీద అరచేయి స్కాన్ చేస్తే చాలు పేమెంట్స్ జరిగిపోతాయి. అయితే ముందుగా మనం మన అరచేయిని స్కాన్ చేసి, దాన్ని మన క్రెడిట్ కార్డుతో లింక్ చేయాలి. ఈ పని చేస్తే తర్వాత కియోస్క్ మీద అరచేతిని ఊపినా చెల్లింపులు జరిగిపోతాయి. ప్రారంభంలో అమెజాన్ వన్ తన గో క్యాషియర్ లెస్ స్టోర్లలో ఈ విధానాన్ని అమలు చేసింది. తదుపరి హోల్ ఫుడ్ సూపర్ మార్కెట్లలో ఈ టెక్నాలజీ ని వినియోగిస్తున్నది. ప్రస్తుతం మన భారత్‌లో ఈ పథకం అమల్లోకి రాలేదు. అమెరికాలో తొలుత ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం అమెరికాలోని 200 హోల్ ఫుడ్ సూపర్ మార్కెట్లలో అరచేయి స్కానింగ్ చెల్లింపుల టెక్నాలజీ చెల్లింపు పాలసీ అమలవుతున్నది. ఈ ఏడాది చివరి వరకు దాదాపు 500 స్టోర్లకు విస్తరించాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకున్నది. అరచేయి స్కానింగ్ చెల్లింపుల టెక్నాలజీకేవలం గ్రాసరీ స్టోర్లకు మాత్రమే పరిమితం కాలేదు. స్టేడియాలు, ఎంటర్‌టైన్‌మెంట్ వేదికలతోపాటు అమెరికాలోని పలు విమానాశ్రయాల వద్ద హుడ్సన్‌, క్రూస్‌, ఓహెచ్ఎం వేదికల వద్ద అమెజాన్ వన్ టెక్నాలజీ వినియోగిస్తోంది. అడ్వాన్స్‌డ్ ఇమేజింగ్ అండ్ కంప్యూటర్ విజన్ అల్గోరిథమ్స్‌తో మీ అరచేతి ఇమేజ్‌ని అమెజాన్ వన్ క్షణాల్లో క్యాప్చర్ చేసేస్తుంది. ఇది మీ పర్సనలైజ్డ్ పామ్ సిగ్నేచర్‌ను క్రియేట్ చేస్తుంది. షాపింగ్ చేసిన ప్రతి సారీ `అమెజాన్ వన్‌` ద్వారా పేమెంట్స్ చేసేయవచ్చు. మీ పర్సనలైజ్డ్ పామ్ సిగ్నేచర్‌ను ఇతర సున్నితమైన మీ పర్సనల్ డేటాతోపాటు సురక్షితంగా దాచి ఉంచుతుంది అమెజాన్‌. ఈ డేటా ఎల్లవేళలా సురక్షితం అని, ఏ డివైజ్‌లోనూ స్టోర్ చేయబోరని అమెజాన్ హామీ ఇస్తోంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu