Ad Code

ఇంటర్నెట్ యూజర్లకు ప్రభుత్వ హెచ్చరిక !

                                        

దేశంలో ఓ ర్యాన్సమ్‌వేర్ వ్యాప్తి కలకలం రేపుతోంది. 'అకీరా' అనే ర్యాన్సమ్‌వేర్ , ప్రజల ముఖ్యమైన సమాచారాన్ని తస్కరించి దోపిడీకి పాల్పడుతోందని కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ సెర్ట్- ఇన్ తెలిపింది. దీని బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇంటర్నెట్ యూజర్లను హెచ్చరించింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీం(CERT-In) ఓ అడ్వైజరీని జారీ చేసింది. విండోస్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలతో నడిచే కంప్యూటర్లలోకి 'అకీరా' ర్యాన్సమ్‌వేర్ చొరబడి డేటాను దొంగిలిస్తోందని అందులో తెలిపింది. ఈ డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి యూజర్ ఉపయోగించడానికి వీలు లేకుండా లాక్ చేస్తుందని పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఇక డబ్బులు డిమాండ్ చేసే పనిని సైబర్ నేరగాళ్లు మొదలు పెడుతున్నారని అడ్వైజరీలో తెలిపింది. అడిగినంత డబ్బు ఇస్తేనే డేటాను తిరిగి ఇచ్చేస్తామని అవతలి వ్యక్తులు బెదిరిస్తారని పేర్కొంది. ఒకవేళ, డబ్బులు ఇవ్వకపోతే డార్క్ వెబ్‌లో ఈ డేటాని అమ్మకానికి పెడతారని తెలియజేసింది. ఫలితంగా, అన్ని విధాల నష్టపోవాల్సి ఉంటుందని వివరించింది.

భారీ మొత్తంలో డబ్బులను వసూలు చేయడమే లక్ష్యంగా ప్రయోగించే ఆయుధమే ఈ ర్యాన్సమ్‌వేర్ అటాక్. కంప్యూటర్లలో హానికర సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసి అవి పనిచేయకుండా లాక్ చేస్తారు. వీటిని అన్‌లాక్ చేయాలంటే అడిగినంత డబ్బులు కట్టాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తారు. లేదంటే కంప్యూటర్‌లోని ముఖ్యమైన సమాచారాన్ని చోరీ చేసి దుర్వినియోగం చేస్తారు. అయితే హానికర మాల్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి సైబర్ నేరగాళ్ల వివిధ మార్గాలను అన్వేషిస్తారు. చిన్న లోపం దొరికినా దాని ఆధారంగా ఆర్గనైజేషన్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ట్రై చేస్తారు. ఆఫర్ల పేరుతో ఉద్యోగులకు వల వేయడం, హానికర ఇమెయిల్స్ పంపించడం వంటివి ఇందులోకే వస్తాయి. ఇలా యాక్సెస్ తీసుకోవడానికి ఏదో ఒక ఎరను సిద్ధం చేసుకుంటారు.

అకీరా ర్యాన్సమ్‌వేర్ బారిన పడకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు పాటించాలని సెర్ట్- ఇన్ సూచించింది. ఇలాంటి దాడుల నుంచి కాపాడుకోవడానికి ఇంటర్నెట్ యూజర్లు కనీస ప్రొటోకాల్స్‌ని ఫాలో కావాలని తెలిపింది. ముఖ్యమైన డేటాని యూజర్లు ఆఫ్‌లైన్‌లో బ్యాకప్ చేసుకోవాలని తెలిపింది. వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలని సూచించింది. ఒకవేళ అటాక్ జరిగినా నష్టపోకుండా ఉండేందుకు ఈ టిప్ సహాయ పడుతుందని పేర్కొంది. రిజిస్ట్రేషన్, డెప్లాయ్‌మెంట్ సమయాల్లో జనరేట్ అయ్యే పాస్‌వర్డ్‌లను మార్చాలని తెలిపింది. వీటిని అలాగే కొనసాగించడం కూడా దాడులకు ఒక కారణం కావచ్చని అంచనా వేసింది. యూజర్లు పటిష్ఠమైన పాస్‌వర్డ్ పాలసీని ఫాలో కావాలని సూచించింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu