Ad Code

హై ఎండ్​ సర్వర్ల తయారీకి హెచ్​పీ, వీవీడీఎన్​ టెక్​ ఒప్పందం


దేశంలో హై ఎండ్​ సర్వర్ల తయారీ చేపట్టేందుకు వీవీడీఎన్​ టెక్నాలజీస్​ అమెరికా కంపెనీ హ్యులెట్​ ప్యాకార్డ్​ ఎంటర్​ప్రైజ్​తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐటీ, టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్​ వెల్లడించారు. రాబోయే 4-5 ఏళ్లలో 1 బిలియన్​ డాలర్ల విలువైన సర్వర్లు తయారు చేయాలని ప్లాన్​ చేస్తున్నట్లు పేర్కొన్నారు. టెక్నాలజీ డెవలప్​మెంట్​లో పరస్పరం సహకరించకోవాలనే అమెరికా-ఇండియా అంగీకరించిన 10 రోజులలోపే ఈ ఎంఓయూ కుదిరింది. ఐటీ హార్డ్​వేర్​ పీఎల్​ఐ స్కీము కింద తాజా ఒప్పందం జరిగింది. ఈ స్కీమును ఇటీవలే ప్రధాన మంత్రి ఆమోదించారు. స్కీము కింద మొదటి ఎంఓయూను వీవీడీఎన్​ టెక్నాలజీస్​తో కుదుర్చుకున్నట్లు అశ్విని వైష్ణవ్​ తెలిపారు. ఈ ఏడాది నవంబర్​ నుంచే ప్రొడక్షన్​ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu