Ad Code

థ్రెడ్స్‌ యాప్‌ దెబ్బకు ట్విట్టర్‌ యూ టర్న్‌!


ట్విట్టర్‌కు పోటీగా మెటా తీసుకొచ్చిన యాప్‌ థ్రెడ్స్‌  ఈ ఉదయం నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. భారత్‌ సహా సుమారు 100 దేశాల్లో ఈ థ్రెడ్స్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే యూరోపియన్‌ యూనియన్‌లో మాత్రం థ్రెడ్స్‌ యాప్‌ అందుబాటులోకి రాలేదు. అక్కడున్న కొన్ని చట్టాల కారణంగా యాప్‌ అక్కడ విడుదల కాలేదు. ఈ థ్రెడ్స్‌ యాప్ చాలా వరకు ట్విట్టర్‌ తరహా ఫీచర్లను కలిగి ఉంది. ట్విట్టర్‌లో కేవలం 280 అక్షరాలు మాత్రమే పోస్ట్‌ చేసేందుకు వీలుండగా,  థ్రెడ్స్‌ యాప్‌లో మాత్రం 500 అక్షరాల వరకు పోస్ట్‌ చేయవచ్చు. మరియు 5 నిమిషాల నిడివితో వీడియోలను కూడా పోస్ట్‌ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌నేమ్‌తోనే థ్రెడ్స్‌ యాప్‌లోనూ లాగిన్‌ కావచ్చు. ఇన్‌స్టాలో ఫాలో అయిన వారిని థ్రెడ్స్‌లో కూడా ఫాలో కావచ్చు. థ్రెడ్స్‌ యాప్‌ అందుబాటులోకి వచ్చిన నుంచి అనూహ్య స్పందన వస్తోంది. తొలి రెండు గంటల్లోనే సుమారు 20 లక్షల మంది థ్రెడ్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. నాలుగు గంటల్లో 50 లక్షల మంది తన అకౌంట్లలోకి సైన్‌అప్ అయినట్లు మెటా సీఈవో మార్క్‌ జుకర్ బర్గ్‌ వెల్లడించారు. అయితే 7 గంటల్లో కోటి మంది థ్రెడ్స్‌ అకౌంట్లు తెరిచినట్లు తెలుస్తోంది. థ్రెడ్స్‌ దెబ్బకు ట్విట్టర్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం ట్విట్టర్‌ సైప్‌ ఆప్‌ కాకుండా ట్విట్టర్‌ బ్రౌజింగ్‌ యాక్సెస్‌ని పరిమితం చేసింది. డేటా స్క్రాపింగ్‌ను నిరోధించేందుకు తప్పనిసరిగా లాగిన్ కావాలంటూ ట్విట్టర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ స్పష్టం చేశారు. అంటే ఏ ట్వీట్‌ చూడాలన్నా కచ్చితంగా అకౌంట్‌లోకి లాగిన్‌ కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ మార్పులను ట్విట్టర్‌ ఈరోజు ఉపసంహరించుకుంది. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక నుంచి లాగిన్ కాకుండానే ట్విట్‌లను చూడవచ్చు. కానీ చాటింగ్‌ చేయడం లేదా ఏదైనా ట్విట్టర్ పోస్టుపై కామెంట్‌ చేయడానికి మాత్రం లాగిన్‌ కావాల్సి ఉంటుంది. ట్విట్టర్‌ ఎలాన్‌ మస్క్‌ చేతికొచ్చాక చాలా మార్పులు తీసుకొచ్చారు. తాజాగా ట్విట్‌లను వీక్షించేందుకు పరిమితిని విధించారు. అంటే వెరిఫైడ్‌ వినియోగదారులు (బ్లూటిక్‌) రోజుకు 10 వేల ట్వీట్‌లు మాత్రమే వీక్షించగలరు. అదే బ్లూటిక్‌ లేనివారు రోజుకు కేవలం 1000 ట్వీట్‌లు మాత్రమే చూడగలరు. అదే కొత్తగా ట్వీట్టర్‌ ఖాతా తెరిచి బ్లూటిక్‌ లేనివారు కేవలం 500 ట్విట్‌లు మాత్రమే చూసేలా నిబంధనలు తీసుకొచ్చారు. ట్విట్టర్‌ తాజా నిర్ణయంపై చాలా మంది నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర సోషల్‌ మీడియా వేదికలకు మారుతున్నారు. ఈ పరిస్థితిని మెటా తనకు అనుకూలంగా మార్చుకుంది. అనుకున్నదాని కంటే చాలా వేగంగా ట్విట్టర్‌కు పోటీగా థ్రెడ్స్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. రానున్న రోజుల్లో ఈ యాప్‌ ట్విట్టర్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.     https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu