Ad Code

"డార్క్" సీక్రెట్స్ తెలుసుకునేందుకు తొలి స్పేస్ క్రాఫ్ట్ !


పురాతన గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు యూక్లిడ్ ఆఫ్ అలెగ్జాండ్రియా పేరును యూక్లిడ్ స్పేస్ మిషన్ కు పెట్టారు. యూక్లిడ్ .. ప్లేటోకు స్టూడెంట్. యూక్లిడ్ ఆఫ్ అలెగ్జాండ్రియా నిర్దేశించిన కొన్ని జ్యామితి సూత్రాల ఆధారంగా ఈ స్పేస్ మిషన్ పని చేస్తుంది. “డార్క్ యూనివర్స్” పై అధ్యయనానికి యూక్లిడ్ అంతరిక్ష నౌక (స్పేస్ క్రాఫ్ట్)ను ప్రయోగించారు. ఇందులో 3.9 అడుగుల వెడల్పు (1.2 మీటర్లు) ఉన్న టెలిస్కోప్ ఉంది. యూనివర్స్ లో భూమి,అంతరిక్షం, పాల పుంతలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ ఉంటాయి. యూక్లిడ్ అంతరిక్ష నౌకలోని టెలిస్కోప్ .. యూనివర్స్ లోని ఫోటోలను స్వల్ప శ్రేణి ఇన్‌ఫ్రారెడ్ కాంతిలోనూ వీక్షించగలదు. క్లోజ్-అప్, హై-రిజల్యూషన్ లో ఆ ఫోటోలను తీయగలదు. సుదూరంలోని గెలాక్సీలను కూడా యూక్లిడ్ టెలిస్కోప్ చూడగలదు. ఇందుకోసం యూక్లిడ్ అంతరిక్ష నౌకలో విజిబుల్ ఇమేజర్, నియర్-ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్, ఫోటోమీటర్  ఉన్నాయి. డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ గురించి మరింత తెలుసుకోవడానికి ఇది దాదాపు ఆరు సంవత్సరాలు రీసెర్చ్ చేయనుంది. విశ్వంలో డార్క్ మ్యాటర్ 26.8%, , డార్క్ ఎనర్జీ 68.3% ఉన్నాయని అంటారు. అదృశ్యంగా ఉండే డార్క్ మ్యాటర్ యొక్క గురుత్వాకర్షణ ప్రభావం ఎంత ? డార్క్ ఎనర్జీ ఎలా ఉంటుంది ? అనే గుట్టును యూక్లిడ్ స్పేస్ మిషన్ వచ్చే ఆరేళ్లలోగా విప్పుతుందని ఆశిస్తున్నారు. ఈ వ్యవధిలో యూక్లిడ్ స్పేస్ క్రాఫ్ట్ 1.5 బిలియన్ గెలాక్సీల ఫోటోలు తీస్తుంది. ఈ మిషన్ కోసం నాసా ఇన్‌ఫ్రారెడ్ డిటెక్టర్‌లను అందించింది. యూక్లిడ్ సేకరించే డేటా విశ్లేషణలోనూ నాసా పాలుపంచుకుంటుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu