Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Saturday, July 15, 2023

ఊబకాయులకు చాట్‌ జీపీటీ, ఏఐ సూచించిన డైన్‌ ప్లాన్‌ !


2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా బిలియన్‌ కంటే ఎక్కువ మంది జనం ఊబకాయం సమస్యతో బాధపడే అవకాశం ఉందని వరల్డ్‌ ఒబేసిటీ ఫెడరేషన్‌, వరల్డ్‌ ఒబెసిటీ అట్లాస్‌ ఫెడరేషన్‌-2022 తెలిపింది. ప్రతి ఐదురుగు మహిళల్లో ఒకరు.. ప్రతి ఏడుగురు మగవారిలో ఒకరు ప్రమాదంలో ఉన్నట్లు పేర్కొంది. అధిక బరువు మధుమేహం, జీవక్రియ, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతో అధిక బరువుతో బాధపడుతున్నారు. క్రమంలో పలువురు బరువు తగ్గేందుకు పలు చిట్కాలు పటిస్తున్నారు. కొందరు భోజనం మానేయం, వ్యాయామం చేయడంతో పాటు ఆహార నియమాల్లో పలు మార్పులు చేసుకుంటున్నారు. మరికొందరు నిపుణుల వద్దకు వారి సలహాలు సూచనలు పాటిస్తూ బరువును తగ్గించేందుకు ప్రయాసపడుతున్నారు.

ప్రపంచ కొత్త సాంకేతిక యుగం వైపు పరుగులు పెడుతున్నది. ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌, చాట్‌ జీపీటీ వినియోగం పెరిగింది. ఎన్నో విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. అధిక బరువుతో బాధపడుతున్న వారు చింతించాల్సిన అవసరం లేదని, ChatGPT, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇటీవల గ్రెగ్‌ ముస్చెన్‌ అనే వ్యక్తి చాట్‌ జీపీటీ చేసిన డైట్‌ప్లాన్‌ ద్వారా 11.7 కిలోల బరువు తగ్గినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఛాట్‌ జీపీటీ రొటీన్‌లో భాగంగా డైట్‌ ప్లాన్‌ చేసింది. ఇందులో రన్నింగ్‌, వాకింగ్‌ సహా ఆహారంలో పలు సాధారణ మార్పులు సూచించింది. చాట్‌ జీపీటీ, ఏఐ సూచించిన డైన్‌ ప్లాన్‌ అనేక దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుందని అంచనా వేశారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఛాట్‌ జీపీటీ ఇచ్చిన డైన్‌ ప్లాన్‌ ఎంత వరకు ప్రభావవంతంగా ఉంటుందని ప్రతి ఒక్కరి మదిలో ప్రశ్న తలెత్తుతున్నది. ఈ క్రమంలో పరిశోధకుల బృందం సర్వే నిర్వహించింది. ఐదుగురు వ్యక్తుల్లో ముగ్గురు ప్రభావంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ ఆహారానికి సంబంధించిన సలహాలు మాత్రమే కాకుండా.. మీ ఆరోగ్యానికి ఏవి ప్రయోజనకరంగా ఉంటాయి.. ఏవి తినకూడదో స్పష్టంగా చెప్పగలదని స్పష్టం చేస్తున్నారు.

కెనడాలోని విద్యావేత్తలు నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్ పేరుతో పిలిచే నిర్దిష్ట ఏఐని ఉపయోగిస్తుంటారు. ఆహార ఉత్పత్తులను మాన్యువల్‌గా వర్గీకరించేందుకు అవసరమైన సమయాన్ని తగ్గించడానికి సాంకేతికతను ఉపయోగించవచ్చని ఓ అధ్యయనంలో గుర్తించారు. చాట్‌ జీపీటీని డైన్‌ ప్లాన్‌ను నిపుణులు పరిశీలించగా.. మిశ్రమ ఫలితాలు కనిపించాయి. అలెర్జీ బాధితుల కోసం డైట్ ప్లాన్‌ను రూపొందించేందుకు చాట్‌బాట్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి నిర్వహించిన ఓ అధ్యయనంలో ప్రజల ఆరోగ్యం ఆధారంగా ఆహార ప్లాన్‌ను అందించగలదని, బరువు తగ్గించడంలో సహాయపడడే మాకుండా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. సాంకేతికత వినియోగంతో ఆరోగ్యరంగంలో మెరుగైన ఫలితాలు వస్తాయని, ChatGPT, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ప్రయోజనాలు పొందే అవకాశాలుంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.   https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts