Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, July 4, 2023

మాగ్నస్ ఎక్స్ పై భారీ తగ్గింపు !


లక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ యాంపియర్ మార్కెట్‌లో పలు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిల్లో మ్యాగ్నస్ ఈఎక్స్ కూడా ఒకటి.  ఒక్కసారి చార్జింగ్ పెడితే ఇది 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెడ్, వైట్, బ్లాక్, గ్రే, బ్లూ కలర్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇది 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 10 సెకన్లలోనే అందుకుంటుంది. ఇంకా పవర్‌ఫుల హబ్ మోటార్‌ అమర్చారు. రివర్స్ మోడ్ కూడా ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 50 కిలోమీటర్లు. బ్యాటరీ ఫుల్ కావడానికి 6 నుంచి 7 గంటలు పడుతుది. రూ. 499తో ఈ స్కూటర్‌ను బుకింగ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్‌పై 5 ఏళ్ల వరకు వారంటీ పొందొచ్చు. మూడేళ్ల స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. అలాగే రూ. 4 వేలు కడితే ఎక్సెండెంట్ వారంటీ లభిస్తుంది. 2 ఏళ్లు ఈ వారంటీ వస్తుంది. ఇలా మొత్తంగా ఐదేళ్లు వారంటీ పొందొచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర  రూ. 1,26,365గా ఉంది. ఇప్పుడు దీన్ని  రూ. 90 వేలకే కొనుగోలు చేయొచ్చు. ఇందులో ఎక్స్‌షోరూమ్ ధర రూ. 81,900. రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ రూ. 8 వేలు. అంటే మీకు ఏకంగా రూ. 36 వేలకు పైగా తగ్గింపు లభిస్తోంది. బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లు ఈ ఫెసిలిటీ పొందొచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈఎంఐ విషయానికి వస్తే నెలకు రూ. 2325 చెల్లిస్తే సరిపోతుంది. అయితే రూ. 27 వేల డౌన్ పేమెంట్ చెల్లించాలి. 36 నెలలకు ఇది వర్తిస్తుంది. లేదంటే 30 నెలల వరకు కూడా ఈఎంఐ పెట్టుకోవచ్చు. రూ. 27 వేలు డౌన్ పేమెంట్ కట్టాలి. నెలకు రూ. 2670 పడుతుంది. 24 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 3191 కట్టాల్సి వస్తుంది. డౌన్ పేమెంట్ రూ. 27 వేలు కట్టాలి.  జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. 36 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 3322 పడుతుంది. అదే 30 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 3815 చెల్లించాలి. 24 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 4559 పడుతుంది. 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 5808 చెల్లించాలి. ఏడాది పాటు ఈఎంఐ అయితే నెలకు రూ. 8316 పడుతుంది.   https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts