Ad Code

చాట్ జీపీటీ టీచర్ ?


చాట్ జీపీటీ, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహయంతో హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది. కంప్యూటర్ సైన్స్ విభాగం లో కంప్యూటర్ సైన్స్ పరిచయం కోర్సుతో ఏఐ ఛాట్‌బాట్ ని అను సంధానం చేయాలని చూస్తోంది. సెప్టెంబర్ లో ఈ టూల్ ని వినియోగం లోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇది అందుబాటు లోకి వస్తే చాట్ జీపీటీనే టీచర్ గా మారి పాఠాలు బోధించనుంది. జీపీటీ 3.5, 4 మోడళ్ల లో ఈ చాట్ బాట్‌ను తయారుచేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించడం తో పాటు సందేహాలు, సమస్యలను అప్పటికప్పుడు తీర్చుతుంది. విద్యార్థులకు 24 గంటలు సహాయ పడేలా ఈ టూల్ ని తయారు చేశారు. ప్రతి విద్యార్థికి ఒక టీచర్ ఉండాలనే లక్ష్యం తో దీనినని తెచ్చినట్లు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్రిమ్సన్ తెలిపారు. అయితే వీటి వినియోగం పెరిగితే ఇక ఉపాధ్యాయుల పని ఉండదని, వారి ఉద్యోగాలు ప్రమాదం లో పడతాయని అంటున్నారు. దీంతో రానున్న కాలం లో ఈ ఏఐ టూల్స్ వల్ల టీచర్ల ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu