Ad Code

యూట్యూబ్‌లో 'స్క్రీన్‌ లాక్‌' ఫీచర్‌ ?


యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే యూట్యూబ్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. స్క్రీన్‌ లాక్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. యూట్యూబ్‌లో వీడియో ప్లే సమయంలో అనుకోకుండా స్క్రీన్‌ టచ్‌ అవ్వడం ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్య. దీని వల్ల వీడియో మధ్యలో ఆగిపోవడం లేదా ఫార్వర్డ్‌ అవ్వడం చూసే ఉంటాం. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే యూట్యూబ్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. స్క్రీన్‌ లాక్‌ పేరుతో యూట్యూబ్‌ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్న సమయంలో లాక్‌ స్క్రీన్‌ మోడ్‌ను ఆన్‌ చేసుకుంటే వీడియో దానంతటదే లాక్‌ అవుతుంది. దీంతో ఫోన్‌ టచ్‌ పనిచేయడం ఆగిపోతుంది. స్క్రీన్‌పైన టచ్‌ చేసినా వీడియో ప్లే అవుతూనే ఉంటుంది. అనుకోకుండా స్క్రీన్‌ టచ్‌ చేసినా ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది. వీడియోను ఫుల్‌ స్క్రీన్‌ మోడ్‌లో చూసే సమయంలో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. స్క్రీన్‌పై ఎడమవైపు పైభాగంలో కనిపంచే ‘లాక్‌ స్క్రీన్‌’ను సెలక్ట్‌ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రానుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu